-
-
బాల వ్యాకరణము - బిపిఎమ్డి పబ్లికేషన్స్
Bala Vyakaranamu BPMD Publications
Author: Paravastu Chinnayasuri
Publisher: BPMD Publications
Pages: 156Language: Telugu
ఆంధ్రభాషకు లక్షణ గ్రంథములు ప్రాచీనులు చేసినవని పెక్కులు కానఁబడుచున్నవి. కొన్ని లక్షణగ్రంథముల పేర్లు మాత్ర మిప్పుడు వినఁబడుచున్నవి. కానఁబడు గ్రంథములందు సంస్కృతసమములకు లక్షణములు బహుతరముగా రచింపఁబడినవి గాని తక్కినభాషకు విశేషాకారముగా రచింపఁబడినవికావు కాఁబట్టి యా లక్షణ గ్రంథములు చదువువారికి నిస్సందేహముగా వచనరచన సేయుకౌశలము చిరకాలము బహులక్ష్యములందుఁ బరిశ్రమము చేయక రానేరాదు. భాషా సమిష్టికి లక్షణగ్రంథము కుదిరిన పక్షమం దంతశ్రమపడఁ బనిలేదు. తుదకు లక్ష్యపరిజ్ఞానము చాలని లక్షణపరిజ్ఞాన మంత శ్లాఘ్యము కాదు గాని తుదముట్ట సర్వలక్షణ పరిజ్ఞానము లక్ష్యపరిజ్ఞానముచేతనే సాధించుట మిక్కిలి దుష్కరము. కాఁబట్టి యిట్టికొఱఁత వారింపఁ బూని పెక్కులక్ష్యములు పలుమాఱు సావధానముఁగా బరిశీలించి రచనాప్రణాళిక నిర్ణయించుకొని నానేర్చుకొలఁదినీ సంస్కృతభాషలో సూత్రగ్రంథ మొకటి కావించితిని. ఆ గ్రంథము బాలురకు సుసాధము గాకుండుటవలన దానియందలి సూత్రములు కొన్ని తెనిఁగించి ప్రకృత గ్రంథరూపమున రచించినాఁడ.
- పరవస్తు చిన్నయసూరి
