-
-
బాల రావణాయణం
Bala Ravanayanam
Author: B. Ramakrishna
Language: Telugu
బాల రావణాయణం
బి. రామకృష్ణ
ఈ గ్రంథంలో చాలా విశిష్టతలున్నాయి. వివిధ చారిత్రక మూలాల నుంచి రావణుడి ప్రాశస్త్యాన్ని, వైదుష్యాన్ని రామకృష్ణ తవ్వితీసారు. రామాయణం ఆధారంగానే రావణుడి బహుముఖ ఘనతను, అతని కొలువులోని వారి దక్షతను బయటకి లాగారు.
- రావిపూడి వెంకటాద్రి
అధ్యక్షులు,
భారత హేతువాద సంఘం
ఆయనం అంటే మార్గము అని అర్థం. రావణుని మార్గం కాబట్టి ఇది రావణాయణం.
రావణుడు (రావన్న) మహా పండితుడు. విలువిద్యలో అందె వేసిన చేయి. అసలు లంకా నగరమే పండితులకు ఆటపట్టు.
రావన్న అపార పాండితీ దురంధరుడు. సంస్కృతంలో తొమ్మిది వ్యాకరణాలు చదివిని మహా మేధావి. ఇతడు 'పంచచామరము ' మొదలైన వృత్తాలలో శివస్తోత్రం వ్రాసినవాడు.
దసగీవుడు ప్రముఖ తాత్వికుడు. కణాదుడు అనే ఆయన వైశేషిక దర్శనం అనే పేరుతో ఒక దర్శనం వ్రాసాడు. ఇది కేవలం అణుసిద్ధాంతాన్ని తెలిపే దర్శన గ్రంథం. దీనికి రావణుడు వ్యాఖ్యానం వ్రాసాడు. ఈ వ్యాఖ్యానాన్ని 'రావణ భాష్యం' అని అంటారు.
It was a good attempt..But not compelling enough. Iam sure the more-religious might be put off.