• Bala Bhasha - free
 • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
  • fb
  • Share on Google+
  • Pin it!
  Ebook Hide Help
 • బాలభాష (free)

  Bala Bhasha - free

  Publisher: BPMD Publications

  Pages: 103
  Language: Telugu
  Rating
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  '5/5' From 3 votes.
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

పండితుడు, పరిశోధకుడు, కవి, రచయిత ఇన్ని విశేషణములు ఏ మహానుభావుని పేరు ముందు జేరి గొప్పతనమును ఆపాదించుకొని సంబరపడుతుంటాయో ఆ ప్రాతఃస్మరణీయ దివ్యమూర్తి శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి గారు.

తెలుగు వారిని ఈనాడు భక్తి పారవశ్యంలో ముంచి తేల్చుతున్న అన్నమయ్య సంకీర్తనలను వెలికితీసుకువచ్చిన పరిశోధక బ్రహ్మ వేటూరి వారు. ఇటీవలకాలంలో జరిగిన కొన్ని పరిణామాలనే తీసుకుంటే తెలుగు ప్రాచీన భాషే అని మనవారు నిరూపించడానికి కూడా ప్రభాకరశాస్త్రి గారి పరిశోధనలు తోడ్పడ్డాయి. క్రీడాభిరామం సృష్టికర్త వినుకొండ వల్లభరాయుడా లేక శ్రీనాథుడా వంటి ఎడతెగని పండితుల వాదనలకు సహేతుక సమాధానలిచ్చి ముగింపు పలికినవారూ ఆయనే. శివకవుల మీద ప్రభాకరశాస్త్రి గారు రాసిన వ్యాసమే మొదటి వ్యాసంగా ‘భారతి’ పత్రిక మొట్టమొదటి ప్రతి అచ్చయ్యింది. వారి అక్షరవాసి ఎంత గొప్పదో తరువాతి కాలంలో ‘భారతి’ గడించిన యశస్సు చెబుతుంది. అంతేకాదు విఖ్యాత కవి ఆరుద్ర గారు కూడా ప్రభాకరశాస్త్రి గారి పరిశోధనలో భాగంగా వెలికి వచ్చిన కొన్ని కూనలమ్మ పదాలకు ఆకర్షితులై అదే మకుటంతో విరివిగా కూనలమ్మ పదాలను పుట్టించారు.


జప తపంబులకన్న,
చదువు సాములకన్న,
ఉపకారమే మిన్న,
ఓ కూనలమ్మా!


ఆడితప్పినవాని,
నాలినేలనివాని,
నాదరించుట హాని,
ఓ కూనలమ్మా!

వంటి జానపదుల నోళ్ళలో నానిన పదములు ప్రభాకరశాస్త్రి గారి చలువతో మనకందినవి.


చప్పట్లోయి, తాళాలోయి,
దేవుడిగుళ్లో మేళాలోయ్‌!
పప్పూ బెల్లం దేవుడికోయ్‌,
పాలూ నెయ్యీ పాపాయి కోయ్‌!


దాగుడుమూతా దండాకోర్‌,
పిల్లీవచ్చె ఎలుకా దాగె!
ఎక్కడి దొంగా లక్కడే
గప్‌చిప్‌ - సాంబారుబుడ్డి


గుడుగుడుకుంచం గుండేరాగం
పావడపట్టం పడిగేరాగం
కాళ్లాగజ్జీ, కంకోలమ్మూ
వేగులచుక్కా, వెలగామొగ్గ


ఎండలు కాసే దెందుకురా?
మబ్బులు పట్టే టందుకురా.
మబ్బులు పట్టే దెందుకురా?
వానలు కురిసే టందుకురా.


కంచికి పోతావా కృష్ణమ్మా!

ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా?
కంచిలో ఉన్నది అవ్వ

ఆ అవ్వ నాకు పెట్టు బువ్వ.

వంటి ఎన్నో ప్రసిద్ధమైన బాలల గీతాలు వారి పరిశోధనతోనే వెలుగులోకొచ్చాయి.

ఈ పాటలను సుమారు 88 ఏళ్ళ క్రితమే వారు భారతి పత్రికలో బాలభాష అనే పేరుతో ప్రచురించారు. ఆ తరువాత కాలంలో అంటే 1956లో ఆర్యశ్రీ ప్రచురణాలయం ద్వారా ఈ పాటలన్నీ కలిపి ఒక పుస్తకంగా వెలువడ్డాయి. ఈ పుస్తకంలో ప్రతీ పాటకు అందమైన బొమ్మలు గీసినవారు గోపీ గారు.

ఇటువంటి అద్భుత సాహిత్యాన్ని పరిశోధించి మనకందించిన ప్రభాకరశాస్త్రి గారికి, వారి రచనలను పరిరక్షిస్తూ భావితరాలకు వెలకట్టలేని సంపదగా అందిస్తూ వస్తోన్న ప్రభాకరశాస్త్రి గారి కుటుంబ సభ్యులకు మనసా నమస్కరిస్తూ...బాలలలోకం లోకి స్వాగతం పలుకుతున్నాము.

- బి.పి.ఎమ్.డి.పబ్లికేషన్స్

గమనిక: " బాలభాష " ఈబుక్ సైజు 6.8mb

Comment(s) ...

He artful thanks for presenting this book free. Some of the songs I used to hear in my childhood

మీకు శతకోటి ధన్యవాదాలు, ఇంత మంచి పుస్తకాన్ని మాకు ఉచితంగా అందిచినందుకు. నిజంగా మీ సేకరణ, కూర్పు ప్రశంసనీయం. అంగ్ల రైమ్స్ చదువుతున్న మన తెలుగు ప్రజానీకం తప్పక పిల్లలకు నేర్పించవలిసిన గేయాలు అందిచిన మీమ్మలను ఎలా పొగిడినా తక్కువే.