• Bahumukha
  • fb
  • Share on Google+
  • Pin it!
 • బహుముఖ

  Bahumukha

  Publisher: Sahiti Mitrulu

  Pages: 416
  Language: Telugu
  Rating
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  '5/5' From 1 votes.
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  '5/5' From 1 premium votes.
Description

కవిత్వానికి వరదగుడి కంటే యెక్కువ రంగులు వేయగలవాడే కవి. కవిత్వాన్ని అతి సామాన్యంగానూ, అసామాన్యంగానూ చెప్పగలవాడే కవి. వస్తువును సమాజపరంగా స్వీకరించి, ప్రజలను ఉద్దేశించి, ప్రజలను సంబోధించి పాడగలవాడే కవి. కుటుంబంలో సమాజాన్నీ, సమాజంలో కుటుంబాన్నీ దర్శించగలవాడే కవి. పదాల అర్ధం, పదాల అందం, పదాల పదును తెలిసి, సరయిన స్థానంలో సరయిన మాటను ఉపయోగించడం కవిత్వ కళలో భాగమని తెలిసినవాడు కవన యవనికను పారదర్శకం చేయగలడు. మాటమర్మం తెలిసినవాడు, మాటలను ప్రదర్శన కోసంకాక, తన మనోభావనను చదివేవాడికీ, వినేవాడికీ ప్రసారం చేయడం కోసం ఉపయోగిస్తాడు. ఊహ చేయలేనివాడు ఉపన్యాసకుడు కాగలడేమోకానీ కవి కాగలడా? వర్జిల్ పదివేల పంక్తులున్న తన చరిత్రాత్మక అసంపూర్ణ మహాకావ్యం ఏనియెడ్‌ని పది సంవత్సరాలపాటు రోమ్‌లో తీరుబడిగా కూర్చుని రచించాడని చెపుతారు. ఆధునిక, సమకాలిక కవికి అలా కుదరదు. అత్యాధునిక కవి, ఈ ఇరవై ఒకటో శతాబ్దపు కవి తొందరలో వున్నాడు. తొమ్మిది వ్యాకరణాలూ చదవ నక్కరలేదు కానీ, ఈనాటి కవికి కవితా నిర్మాణ సామాగ్రీ, సాధనసంపత్తీ మస్తిష్కయంత్రపు మీటల ఫలకంమీద వుండాలి. ఊహ వ్యోమనౌకవలె తృటిలో పైకి దూసుకు పోవాలి. చదివిన తరువాతో, విన్న తరువాతో మనం క్షణకాలం నిశ్శబ్దంగా వుండిపోకపోతే అది సఫల కవిత్వం కాదు. మనని కవ్వం చిలికినట్టు చిలకకపోతే అది సఫలకవిత్వం కాదు. మనని ఒక లిప్తపాటయినా గగనంలోకి, గాలిపటం వలె ఎగరవేయక పోతే అది సఫల కవిత్వం కాదు. నా కవిత్వం ఇటువంటి స్థితికి చేరాలనే నా సాధన. కవి ఒక నిరంతర పాంధుడూ, ఒక నిరంతర నిషాదుడూ కావాలి. పారిపోయే దుప్పిని పట్టుకోవాలి. పైకి లంఘించే చిరుతను బాణంతో కొట్టిపడవేయాలి. అదే నా యాతన.

- దేవిప్రియ

***

దేవిప్రియ గురించి సంక్షిప్తంగా చెప్పడం సాధ్యం కాదు. విస్తృతంగానే మాట్లాడాల్సి ఉంటుంది. ఆయన రాసిన ‘అమ్మచెట్టు' కవిత్వం నుండి 'ఇం..కొకప్పుడు' దాకా నిర్మించి ఇచ్చిన రూపకాల రహదారులను, సామాజిక, రాజకీయ సంవేదనలను, కూర్చిపెట్టిన సిమిలీల సాగరాలను, వెలిగించి ఇచ్చిన దీప్తి చైతన్యాలను సతతమూ గుర్తుకు తెచ్చుకోవలసిందే. నిత్య పరిణామ శీలమైన కాలగతిలో దేవిప్రియ కవిత్వం ఒక ప్రధానమైన పాయగా కాక ఒక మహానదిగా ప్రవహిస్తూ వచ్చిందన్న సంగతి ఇప్పుడిప్పుడే తెలుగు సాహిత్యం గ్రహించగలుగుతున్నది.

- పబ్లిషర్స్

గమనిక: " బహుముఖ " ఈబుక్ సైజు 20.7mb

Preview download free pdf of this Telugu book is available at Bahumukha