-
-
బహుళ
Bahula
Author: Multiple Authors
Publisher: Perspectives
Pages: 407Language: Telugu
ఇవాళ సమాజంలోని అన్ని రంగాల్లో అన్ని అంశాలపైనా వివిధ కోణాల్లో “చర్చ" జరుగుతోంది. అది సృజనాత్మక రంగమైన సాహిత్యంలో మరింత వాడిగా, వేడిగా, విస్తృతంగా ప్రతిఫలిస్తోంది. విప్లవోద్యమాల నుంచి అస్తిత్వ ఉద్యమాల దాకా అవి సంధించే ప్రశ్నలకు జవాబులు వెతుక్కోవాల్సిన, చెప్పాల్సిన బాధ్యత బుద్ధిజీవులైన రచయితల పైన సహజంగానే వొత్తిడిని పెంచుతుంది.
మౌనం, దాటవేత ఏమాత్రం సహించని నూతనతరం సరికొత్త ఆలోచనలను రేకెత్తిస్తూ, కొత్త ప్రశ్నలను సంధిస్తోంది. పాత జవాబుల స్థానే కొత్త జవాబులను డిమాండ్ చేస్తోంది. ఆ విధంగా కాలం మన ముందుకు కొత్త సవాళ్ళను విసురుతోంది. సృజనకారులు సాహిత్య విమర్శకులు, సామాజిక వ్యాఖ్యాతలు కూడా. అందువల్ల వెల్లివిరుస్తోన్న చైతన్యం కొత్త భావోద్వేగాలకు, కొత్త చర్చలకు 'తెర' తీసింది. సమాజం పొరల్లో ఒక నూతన తాత్త్విక వొరవడి అంతర్లీనంగా ప్రవహిస్తూ ఆశావహమైన భవిష్యత్తును వాగ్దానం చేస్తోంది. నిర్ధారించబడ్డాయనుకున్న తత్వాలను, సూత్రాలను, సత్యాలను తిరిగి మళ్ళీ నూతనంగా ప్రశ్నించే తరం ప్రతి సందర్భంలో వొకటుంటుంది. అన్ని ఆటుపోట్లనూ తట్టుకుంటూ కొత్త వెలుగులు ప్రసరిస్తూ ఆ తరం కొత్త ‘బాట’ను వేయటం చరిత్ర పొడుగునా కనిపిస్తుంది.
పర్స్పెక్టివ్స్ మేనిఫెస్టోలో బాలగోపాల్ చెప్పినట్లు 'అణచివేతనూ, అసమానతనూ వ్యతిరేకించేది ఏదయినా ప్రజాస్వామిక దృక్పథమే. మౌలికంగా అభ్యుదయ దృక్పథమే. ఆపైన ఎన్ని తేడాలున్నా వినదగినదే, చర్చించదగినదే, అధ్యయనం చేయదగినదే.' ఆ అవగాహనతోనే మేము ఈ ప్రచురణలను కొనసాగిస్తున్నాం.
సాహిత్య విమర్శలో వివిధ అంశాలపై పరిశీలనాత్మకంగా రాసిన ఈ వ్యాసాలను ఓపెన్ డిబేట్ లా భావించి చర్చించాలని ఈ ప్రచురణను తెలుగు పాఠక లోకం ముందుకు తెస్తున్నాం. ఈ కృషిలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికీ పేరు పేరునా మా కృతజ్ఞతలు. మీరు అందించిన ఈ సహకారం మాతో మరికొన్ని ముందడుగులు తప్పక వేయిస్తుంది. తెలుగు సాహిత్య విమర్శలో ఆలోచనల బహుళత్వాన్ని ఆహ్వానిస్తూ సాహితీ మిత్రుడు ఎ కె ప్రభాకర్ సంపాదకత్వంలో మేము చేస్తున్న ప్రయోగమే ... బహుళ
- పబ్లిషర్స్

- FREE
- FREE
- ₹180
- FREE
- ₹270
- FREE