• Badhyata
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • బాధ్యత

    Badhyata

    Pages: 195
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

“ఏం చదువుకున్నావ్?”

వరుని అక్క రుక్మిణి ప్రశ్నతో తల ఎత్తిందామె. ఆమె సమాధానం చెప్పేలోగా పార్వతమ్మ చెప్పింది.

“ఇంటర్ చదివిందండీ!”

ఉమకి రుక్మిణిపై మొదటి చూపులోనే సదభిప్రాయం కలగలేదెందుకో.

ఆమె ధోరణి చూస్తే తమ్ముడి బలవంతంపై అక్కడికి వచ్చినట్లుంది. ఆ ముఖంలోని అయిష్టత, ముళ్ళమీద కూర్చున్నట్లున్న ఆ తీరు చూస్తే తమ సంబంధం ఆవిడకి ఇష్టంలేదని అర్ధమయింది. తల తిప్పుకోబోయిన ఈమెకి తననే చిరునవ్వుతో చూస్తున్న అతను కనిపించాడు. ఆమె గుండెఝల్లుమనగా కలవరంగా తల దించేసుకుంది.

అతను పెద్ద అందగాడు కాడు కానీ ఆకర్షణీయంగా వున్నాడు. ఎందరో అబ్బాయిలు తనని మాట్లాడించాలని ప్రయత్నించేవారు. వాళ్ళు తనవైపు చూసినప్పుడు తనపై వాళ్ళకళ్ళలో వ్యక్తమయ్యే ఆరాధనని గమనించినా కలగని అలజడి తనలో ఇప్పుడెందుకు? అవ్యక్తమైన అనుభూతికి లోనయింది ఆమె మనసు.

అంతలోనే తననితాను నిందించుకుంది. 'ఛ! ఏమిటిది? పెళ్ళిచూపులకి వచ్చిన ఒక అపరిచితుడిని చూసి తన మనసు పరవశానికి లోనవుతోంది? ఈ సంబంధం తమకి అందనంత ఎత్తులో వుందని తెలిసే అమ్మ సంతృప్తికోసం పెళ్ళిచూపులకి కూర్చుంది. అతనిపై ఆశలు పెంచుకోవడం అనవసరం' అలా అనుకోగానే ఆమెకి అతనిపై ఇంట్రెస్ట్ పోయింది.

పెళ్ళివారు వెళ్ళాక చీర మార్చుకుని బయటికి వస్తున్న ఉమకి దేముడి పటంముందు కళ్ళు మూసుకుని, చేతులు జోడించి నిలబడి వున్న తల్లి కనిపించింది.

“అమ్మ పిచ్చిది. ఈ సంబంధం కుదరాలని అప్పుడే దేముడిని ప్రార్థిస్తోంది” అనుకుని చిన్నగా నవ్వుకుంది.

Preview download free pdf of this Telugu book is available at Badhyata