• Baba Amte - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
  • బాబా ఆమ్టే (free)

    Baba Amte - free

    Pages: 61
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మానవుని సుఖశాంతులకు అనేక రకాల జబ్బులు ఆటంకం కల్గిస్తుంటాయి - కొన్ని జబ్బుల ప్రభావం స్వల్ప కాలమే వుండగా మరి కొన్నిటి చెడు పరిణామాలు దీర్ఘకాలం కొనసాగుతాయి. గతంలో ప్లేగు, మశూచి వంటి కొన్ని జబ్బులు ఉప్పెనల్లా వ్యాపించి ఒక్కో ప్రాంతంలో ఉపద్రవాలను సృష్టించి, అసంఖ్యాక మరణాలకు, అనేక అరిష్టాలకు దారి తీసేవి. అయితే అటువంటి వ్యాధులు రావడానికి, వ్యాప్తి చెందడానికి కారణాలు తెలియడం వల్ల, టీకా మందుల వల్ల వీటి భయం ఇప్పుడు మనకు లేదు. కాని కొన్ని కొత్త జబ్బులు వచ్చి కొత్త సమస్యలను సృష్టిస్తున్నాయి. మరో వంక కుష్టు, క్షయ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఇంకా ప్రపంచంలోని పలు ప్రాంతాలలో సమస్యలుగా ఉన్నాయి. తరతరాల నుండి ఇవి సామాజిక, ఆర్థిక, వైద్య సమస్యలుగా, సవాళ్ళుగా ఎదురు నిలిచాయి.

అయితే రోగాలు, రొష్టుల నుంచి మానవులకు విముక్తి కల్గించడంలో, అస్వస్తులకు ఊరట కలిగించడంలో, చికిత్సా సౌకర్యాలు కల్పించడంలో, పునరావాసపు ఆసరా చూపడంలో శాస్త్రవేత్తల, సామాజిక కార్యకర్తల, త్యాగమూర్తుల పాత్ర విశిష్టమైనది. వారు అందించిన విజ్ఞానం, నడచిన బాటలు, చేసిన సేవలు, తరువాత తరాలవారికి చరిత్రలో ఆదర్శాలుగా నిలిచాయి.

భారతేదేశపు వైద్య సమస్యల్లో ఒకటైన కుష్టువ్యాధిని నిరోధించడానికి, నిర్మూలించడానికి కృషి చేసిన శాస్త్రవేత్తలు సంఘసేవకులు, త్యాగశీలురు ఎందరో వున్నారు. వ్యాధిపట్ల గల అపోహలను తొలగించి, అవగాహనను పెంచడంలో వీరి నిర్మాణాత్మక కార్యక్రమాలే దిక్సూచులుగా నిలిచాయి. తమదైన విశిష్ట విధానంలో కుష్టునిర్మూలనా పధంలో, పధకంలో మానవసేవ చేస్తున్న మహనీయులలో అగ్రగణ్యులు మదర్ థెరిసా, బాబా ఆమ్టే వంటి వారు.

బాబా ఆమ్టే గారి జీవిత విశేషాలు, ఆయన విశిష్ట కృషి వివరాలు తెలిపే ప్రయత్నమే ఈ రచన.