-
-
బాల సంజీవని
Baala Sanjeevani
Author: Lakshmana Rekha N. Gopalakrishna
Pages: 59Language: Telugu
''పుస్తకం మనస్సును శాంతపరుస్తుంది; చల్లని మాటలు చెబుతుంది; సందేహాలను తీరుస్తుంది; ధైర్యాన్ని కలిగిస్తుంది; తల్లిదంద్రులవలె, పెద్దలవలె సదుపదేశం చేస్తుంది''.
శ్రీ వేంకట పార్వతీశ్వర కవులు పుస్తకాన్ని గురించి ఓ గీత పద్యంలో చెప్పిన భావమిది. అయితే పుస్తకంలోనిది పుస్తకంలో ఉండరాదు; అది మస్తకంలో చేరాలి. అందుకే ఇతరుల చేతికి వెళ్ళిన ధనం పుస్తకంలోని విద్య మనకందుబాటులో ఉన్నాయనుకోరాదని ఓ సంస్కృత శ్లోక సారాంశం. విద్య రానివాడు వింత పశువన్న సామెత అందరికీ తెలిసిందే.
ఇలా ఎన్నో! సూక్తులు మనకు కనిపిస్తున్నాయి; వినిపిస్తున్నాయి. పాఠ్యాంశాలలో భాగంగా సంస్కారాలు నీతి సందేశాలు అందించాల్సిన అవసరం ఉందని విద్యావేత్తలందరు అంగీకరిస్తున్న విషయమే. అందుకే ఒకప్పటి పాఠ్యాంశాలలో నీతిశాస్త్రముండేది.
ఇప్పుడు మళ్ళీ అందరూ సదాచారం, నీతిశాస్త్రం పదవ తరగతివరకు విద్యార్థులకొక పాఠ్యాంశ్యంగా ఉండాలని నొక్కి చెబుతున్నారు. కాని ఇంకా క్రియాశీలమైన పని జరగడం లేదు.
అందుకే బాలబాలికలకు సంస్కారాలందించడానికీ, నీతిపద్యాలనూ, దేశభక్తి గేయాలనూ, చిన్నచిన్న కథలనూ, చిట్టి నాటికలనూ రచయితలు సొంతంగా అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే సాహిత్యశ్రీ ఎన్.గోపాలకృష్ణగారు ఈ బాలసంజీవని రచించారు.
ఇవన్నీ బాలబాలికలకే కాదు, అందరి వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేసేవి.
ఎనిమిది అంశాలున్న ఈ బాల సంజీవని ఆంజనేయుడు ఆనాడు తెచ్చిన సంజీవని కొండ వంటిదే. కొండంత అర్థాన్నిచ్చినా - పరమార్థాన్నిచ్చినా సంజీవని ఓ చిన్న మొక్క కదా! లేకపోతే ఓ పుల్ల కదా! ఈ పుస్తకం అంత చిన్న మొక్కే. కాని ఇది బాలబాలికల మనస్సులలో అమృతాన్ని నింపుతుంది. వారిని దివ్య దేశభక్తులుగా నిర్మాణం చేస్తుంది. ఇటువంటి సాహిత్యం ఇంకా ఇంకా సృష్టించి తెలుగు బాల సాహిత్యాన్ని రచయిత సుసంపన్నం చేస్తారని ఆశిస్తూ ఈ గ్రంథానికి స్వాగతం పలుకుతున్నాను.
- ఆచార్య కసిరెడ్డి

- ₹108
- ₹60
- ₹270
- ₹60
- ₹60
- ₹60