-
-
బి.ఎస్.రాములు కథలు సామాజిక పరిణామాలు
B S Ramulu Kathalu Samajika Parinamalu
Author: Nandigama Nirmala Kumari
Publisher: Vishala Sahitya Academy
Pages: 144Language: Telugu
సామాజిక జీవితంలోని ప్రతిపార్శ్వాన్ని చిత్రీకరించడానికి కథ ఒక సాధనం. పాత్ర చిత్రణ, పాత్రల వైవిధ్యం, సంభాషణల్లోని వాస్తవికత రచయిత సామర్ధ్యం మీద ఆధారపడి ఉంటుంది.
కథల ద్వారా మానవ సంబంధాల్లోని స్థితిగతులు, సుఖదుఃఖాలు, సంస్కృతి, చరిత్ర, మానవీయ విలువలను సమాజానికి అందించవచ్చు. నా పర్యవేక్షణలో చి॥ నిర్మలకుమారి ఈ లఘు సిద్ధాంత గ్రంథాన్ని రచించారు. చి॥ నిర్మల కుమారి షుమారు 150 చిన్న కథలను ఎన్నుకొని నాల్గు అధ్యాయాల్లో వివరించారు. బి.ఎస్. రాములు జీవిత ఘట్టాలను మొదట ప్రస్తావిస్తూ - కథల పుట్టుక, కథల వికాసం, కథలు రాసేనాటి పరిస్థితులు, ఆనాటి విలువలు - ప్రతి కథ ఆయువుపట్టు, అన్యాయం జరగకుండా న్యాయం కోరుకోవడం, భూమి సమస్య, భూమికోసం తిరుగుబాటు విధానాన్ని ఉద్యమం ద్వారా సాధించిన క్రమాన్ని పరిశోధకురాలు విశ్లేషించిన తీరు అభినందనీయం. వర్తమాన పరిస్థితుల్ని సమాజానికి తెలియపర్చడమే కథల ముఖ్యోద్దేశ్యం. ప్రజల జీవన ప్రమాణాలు పెరగడానికి మార్పులు రావాలని, సామాజిక న్యాయం, సామాజిక మార్పు కోసం ఉద్యమించే జన జీవన నాడిని, వాస్తవికతను కథల్లో చక్కగా విశ్లేషించారు. ఈ కథలన్నీ హృదయాలను కదిలించే తరంగాలు. ఇవి రచయిత సామాజిక స్పృహకు, ప్రగతిశీల భావాలకు, అర్థతకు సమకాలీన స్పందనకు సాక్ష్యాలు.
ఈ పరిశోధన వల్ల సమకూడిన అనుభవంతో చి॥ నిర్మల కుమారి పిహెచ్.డి., ని మరింత లోతైన కృషి కొనసాగించాలనీ... ఆకాంక్షిస్తున్నాను.
- డా॥ సిహెచ్. యాదయ్య
