-
-
అయ్యయ్యో దమ్మక్కా...
Ayyayyo Dammakka
Author: Joopaka Subhadra
Publisher: Dandora Publications
Pages: 64Language: Telugu
Description
చినుకులు
వూరు వలస ముల్లెలు
గట్టుకొని ఎదురుచూస్తుంది
వూరి సుట్టు గుట్టలు
ఆకాశాన చంద్రుడు చుక్కలు
చంద్రుడు సిల్లంకల్లమైండా
సుక్కలే కుప్పగూడి ముద్దయినయా...
వాగు ఎండు డొక్కయింది
నీళ్లను యిసుక వూటల్ని
ఏ దొంగలు దోక్కపొయిండ్రో...
గోదారి లోయ చుట్టూ
పొంగుతున్న బొగ్గు గనులు
ఏ బాంచలకు బాంచ చరిత్రల
సమాధుల చీకటి పొరలో...
గ్రేటర్ పటాల్లో
కాటగల్సిన పల్లె పక్షికి
పట్నాల సిమిటి కొమ్మలు
సందుబుట్టనిస్తయా
కొండ సుట్టూర బండలు
ఎన్నడూ నీళ్లకై లేవని
ఆవుల మందలు
బాల కార్మికులు
చెమట చెత్త కుప్పల్ల
పలిగిపోయిన
అక్షరాల పలకలు
- మన తెలంగాణ ద్వితీయ వార్షిక ప్రత్యేక సంచిక, మార్చి, 2007
Preview download free pdf of this Telugu book is available at Ayyayyo Dammakka
Login to add a comment
Subscribe to latest comments
