-
-
ఆయుర్వేద విజ్ఞానము
Ayurveda Vignanamu
Author: Kekalathuri Krishnaiah
Pages: 260Language: Telugu
మన దేశంలోను, కొన్ని ఇతర దేశాల్లోను చాలామటుకు ఆయుర్వేదం మీద నమ్మకం పెరుగుతోంది. ఆయుర్వేద వైద్యంలో సహజంగా ప్రకృతిలో దొరికే, మనకు అందుబాటులో ఉన్న వస్తువులతోను, వనమూలికలతోనూ మనకు కలిగే సాధారణ జబ్బులకు మరియు ఆరోగ్యంగా జీవించుటకు ఎంతో ఉపయోగ పడుతున్నాయి.
మా నాన్నగారు మంచిపేరు గాంచిన ఆయుర్వేద వైద్యులు. కాకపోతే వారు నా ఏడవఏటనే పరమపదించినారు. తర్వాత మా అన్నగారు తన కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూ, అవసరమైన చోట చుట్టుపక్కల ఉన్నవారికి, బంధువులకు ఉపయోగపడేవారు. మా నాన్నగారు వాడిన వైద్యగంథాలు ఉండేవి. మా అమ్మగారికి కూడా ఇంటివైద్యం, మూలికా వైద్యం తెలుసుండేది. కొన్ని అవసరాలకు మా అమ్మగారు పొలాల్లో గట్టుల వెంబడి, ఇతరచోట్ల కొన్ని మందు ఆకులు తీసుకువచ్చేవారు.
నేను 1968 నుండి 1976 వరకు ఉద్యోగము వదిలేసి వ్యవసాయం చేశాను. సుమారుగా 1971 నుండి సరిగా వర్షాలు పడక పంటలు సరిగా పండలేదు. 1975 పావు వంతు పంట చేతికి వచ్చింది. ఈ సంవత్సరం కుటుంబాన్ని ఎట్లా పోషించాలా అని ఆలోచించాను. అప్పుడు నాకు పరిచయం లేని మూల పల్లెటూరుకు వెళ్ళి వైద్యం చేసి జీవించాలనుకున్నాను. 1975వ సంవత్సరములో చిత్తూరు జిల్లా, పలమనేరుకు మూడు కిలోమీటర్ల దూరంలో కీలపట్ల అనే గ్రామం ఎన్నుకున్నాను. అక్కడ అందరి సహకారంతో విజయవంతంగా ఒక సంవత్సర కాలం వైద్యము చేసి నా కుటుంబాన్ని పోషించాను.
కాబట్టి మా పెద్దల అనుభవము, నా అనుభవము దృష్టిలో పెట్టుకొని సామాన్యులకు కూడా అర్థమయ్యే విధముగా ఆయుర్వేద వైద్య గ్రంథం వ్రాద్దామని సంకల్పించి ఇది వ్రాయడం జరిగింది. ముఖ్యంగా రోగాలు ఎందుకు వస్తాయి. ఏ ఆహారం మంచిదని వ్రాయడం జరిగింది. తర్వాత సాదారణ జబ్బులకు ఎక్కువ శ్రమపడకుండా స్వతహాగా వైద్యం చేసుకునే విధంగా వ్రాయబడింది.
కాబట్టి ఈ వైద్యగ్రంథం సామాన్య జనులకు సైతం ఉపయోగ పడుతుందని సమ్ముచున్నాను.
- కేకలతూరి క్రిష్ణయ్య

- ₹154.02
- ₹216
- ₹255
- ₹162
- ₹122.4
- ₹181.56