• Avyaktam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అవ్యక్తం

    Avyaktam

    Pages: 168
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


అవ్యక్తం..!
ఒక దీర్ఘకవిత. ఒక స్మృతి కావ్యం!!
చనిపోయిన తండ్రిగారి స్మృతుల భారం తగ్గించుకుందుకు రాసిన ఎలిజీ !!!
‘కలరవాలు’ వచన కవితా సంపుటి ప్రచురించి,
‘తుఫానురాత్రి’ని దీర్ఘకవితగా వెలువరించి,
‘వికలకూజితం’ అనే కలం వినిపించిన కవి హృదయాన్ని
ఆవిష్కరించిన శ్రీ ఆత్మకూరు రామకృష్ణగారు వ్రాసిన మరో దీర్ఘకవిత.
జీవన సేద్యంలో ఇన్నాళ్ళు తోడుగా నిలిచిన నాన్న
ఇక లేడన్న దుఃఖంతో విరిగిన కవిహృదయం
వర్షించిన తండ్రి జ్ఞాపకాలే ఈ ‘అవ్యక్తం’.
దీర్ఘకవితగా రూపొంది, ఆ తండ్రి స్మృతికే 'అంకితం’ అయింది.
అక్షరాక్షరంలో ఆర్తి ఘనీభవనమై కనబడుతుంది.
నాన్నను కోల్పోయిన భాద అవ్యక్తమనో,
నాన్న స్మృతులు అవ్యక్తమనో ఒక భావం మనసులో కదలాడగా
ఈ దీర్ఘకవితకి ‘అవ్యక్తం’ అన్న పేరుంచారు రామకృష్ణ. కానీ
అత్యద్భుతంగా తన స్మృతులను, స్మృతుల నేపథ్యాలనూ సువ్యక్తం చేసారు.
హేతుపూర్వకమైన తర్కంతో విశ్లేషిస్తూ, ఉపనిషత్కారునిలా జీవన్మరణాల
పొలిమేరల్లో నిలిచిన తాత్వికుడే అవుతాడు కవి.
తండ్రి జ్ఞాపకాలు, స్మృతులతో వచ్చిన కవితల్లో
మేటిగా నిలుస్తుంది ఈ ‘అవ్యక్తం’.

- శ్రీ మాకినీడి సూర్యభాస్కర్

Preview download free pdf of this Telugu book is available at Avyaktam