-
-
అవతలి గట్టు
Avatali Gattu
Author: Aravinda (A.S.Mani)
Publisher: Self Published on Kinige
Pages: 220Language: Telugu
Description
జీవితమనే నదిలో ఈదుతుంటే అవతలిగట్టు చేరగలమా, మునిగిపోకుండా బయటపడగలమా అని మనిషి తల్లడిల్లిపోతాడు. అవతలి గట్టు చేరుకున్న వారంతా అదృష్టవంతుల్లాగ కనిపిస్తారు.
జీవితంలో చవిచూడవలసిన కష్టాలూ, దుఃఖాలూ, మానసిక వేదనలూ అన్నీ చవిచూసి లీల ‘అవతలిగట్టు’ చేరుకున్నది. ఈ సుదీర్ఘమైన జీవనయాత్రలో ‘లీల’ అనే విద్యావంతురాలైన మహిళకు సున్నితమైన మానసిక సమస్యలు ఎదురైనాయి.
శారద విచిత్ర ప్రవర్తన వెనుకగల బాధాయమ గాథ.... ప్రభు నిర్లిప్తత వెనుకగల గూఢ పశ్చాత్తాపము... రవిలో జ్వలించే విప్లవ జ్వాలలు....
లీల ఇన్నింటిని చూసింది. కొన్ని అనుభవాలు ఆమెలో ఆలోచనలను రేకెత్తించి విజ్ఞానజ్యోతిని వెలిగించాయి.
అత్యంత ఆధునిక భావాలుగల పాత్రలతో, ఆసక్తి కలిగించే కథా గమనంతో, నిత్య జీవిత సత్యాలను ప్రస్ఫుటీకరించే ఆలోచనా ధోరణిలో పాఠకులను ఉత్తేజితులను చేసే కొత్త తరహా నవల.
Preview download free pdf of this Telugu book is available at Avatali Gattu
Login to add a comment
Subscribe to latest comments
