• Avagahana Modati Samputi
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అవగాహన - మొదటి సంపుటి

    Avagahana Modati Samputi

    Author:

    Pages: 199
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

డా. రాధేయ నాలుగు దశాబ్దాలుగా ఆధునిక తెలుగు కవిత్వాన్ని అభ్యుదయ దృక్పథంతో సుసంపన్నం చేస్తున్న కవి. కవిత్వ ప్రోత్సాహకుడు కూడా. ముప్ఫై ఏళ్ళ నుండి "ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు" ప్రదానం చేస్తున్నారు. ఇవాళ పేరుమోసిన చాలామంది కవులలో ఈ పురస్కారం తీసుకున్నవాళ్ళు ఉన్నారు. కవిగా, కవిత్వపాఠకునిగా, కవిత్వ విమర్శకునిగా రాధేయ రాటుదేలినవారు. ఆధునిక కవిత్వం మీద పరిశోధించి సిద్ధాంత గ్రంథం రచించారు. పాఠకుడిగా పరిశోధకుడుగా తలపండి రాధేయ విమర్శలో ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. ఇదొక బృహత్ర్పణాళిక. అందులో భాగమే ఈ పుస్తకం ‘అవగాహన’.

- ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి

చక్కటి ప్రతిభామూర్తి, విశ్లేషకుడు!
సాహితీరంగంలో కృషిచేస్తున్న కొందరు వర్తమాన కవుల వ్యక్తిత్వాలను రాధేయ ఎంతో చిత్తశుద్ధితో తమ 'అవగాహన’ అన్న గ్రంథంలో చిత్రీకరించారు. ఇందులో ప్రతిభామూర్తులైన సాహితీవేత్తలను గురించిన వ్యాసాలున్నాయి. వారి కవితా సంపుటాల నుంచి విస్తృతంగా ఉదాహరణలును ఇవ్వటం కూడా జరిగింది. దీంతో పాఠకుడికి ఆ కవిని గూర్చిన పూర్తి అవగాహన ఏర్పడిందని చెప్పవచ్చు. ఎంతో ఓపికతో విషయ సేకరణ చేసి వ్యాస పరంపరను పూలబాణాలుగా సంధించిన రాధేయకు నా అభినందనలు.

- డా. అమ్మంగి వేణుగోపాల్

Preview download free pdf of this Telugu book is available at Avagahana Modati Samputi