-
-
ఔరా భారతా!
Aura Bharata
Author: Naveen Kumar Nama
Publisher: Rani Publications
Pages: 40Language: Telugu
మహాకవి శ్రీ శ్రీ చెప్పినట్లు అందమైన "అబద్ధాలలో కన్నా నిష్టూరమైన నిజంలోనే మంచి కవిత్వం దర్శనీయమౌతుంది" అనే విశ్వాసంతో ఒక కొత్తతరం తెలుగు యువకుడు చేసిన సాహిత్య కృషి ఈ ఔరా భారతా! పుస్తకం. వచనం రాజ్యమేలుతున్న సమయంలో పద్యం రాయాలనుకోవడం, అదీ సులభమైన పద్యం రాయాలనుకోవడం కత్తిమీద సాము. కానీ, నవీన్ కుమార్ నామా ఈ సామును విజయవంతంగా పూర్తిచేశారు. ఒకవైపు భావ ప్రధానంగా వుంటూనే, ఇంకోవైపు దేశంలోని అనేక సమస్యలను, మూఢనమ్మకాలనూ, అజ్ఞానాన్ని, కఠోర వాస్తవాలను, విస్మరించిన సాంప్రదాయాలను ప్రశ్నిస్తూ సాగిన 108 పద్యాల సమాహారం ఈ పుస్తకం.
హిందుత్వమంటే జీవన విధానమే కానీ, మతం కాదని బలంగా నమ్మే వ్యక్తినని నవీన్ మొదటే స్పష్టం చేశారు. "మన పూర్వీకులు, మునులూ సంస్కృతి, సంప్రదాయం, ఆచార వ్యవహారాల రూపంలో మనకు వారసత్వంగా అందించిన అమూల్యమైన సంపదే హిందూ జీవన విధానం. వీటన్నిటిలోనూ దైవత్వంతో పాటూ శాస్త్రీయత దాగి వుందని, అవన్నీ ఒట్టివికావు గట్టివి" అనే ఆయన నమ్మకం ఈ పుస్తకంలో ప్రతి పేజీలో కనిపిస్తుంది. కానీ, నేడు మన సమాజంలో కొందరు మూలాన్ని మరచి మూఢాన్ని పట్టుకు వేలాడుతుంటే, కొందరు మూలాన్ని వెతికే ప్రయత్నం విడిచి, మూఢాన్ని ప్రశ్నిస్తూ మన సంస్కృతినే వ్యతిరేకిస్తున్నారు, మరి కొందరు రెంటినీ కాదని వక్రమార్గాలు పడుతున్నారు, చివరికి మన సనాతన ధర్మాన్ని మనమే విస్మరించి భావితరం ఎలా జీవిస్తుందో అని ఆందోళనపడే స్థితికి దిగజారామని ఆవేదన వ్యక్తం చేస్తారు. అలసత్వం, అజ్ఞానం, ఆధునికత, స్వార్థాహంకారాలతో శారీరక మానసిక రుగ్మతలకు గురై దానినే మన పిల్లలకు వారసత్వంగా అందిస్తున్నామని బాధపడతారు. ప్రతి మనిషీ ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని పర్యవసానాలు అంచనా వేసుకుంటే ... మన మనోఫలకంపై ఒళ్ళు గగుర్పొడిచే దృశ్యం దర్శనమిస్తుందంటారు.
A book worth to read ...A book worth to share with friends. Funny,thought provoking,informative,philosophical,traditional and cultural content inside each poem.book made me to read multiple times.... Thank you Naveen.
అందమయిన .,అపురూపమయిన .,ఆకర్షనీయమయిన కావ్యాన్ని అందించినందుకి నీకి దన్యవాదములు అన్నయ్య(నవీన్).,
పురుషోతం అన్నయ్య స్పందనతో మొదలు పెట్తి నేను చివరి వరకి నిర్విరామముగా చదివా ,108[18,25,37,45,52,73,84-నీతి మరియు 105- దేవుడు} పద్యాలని చదివేపుడు,శ్రీ శ్రీ మహాప్రస్తానం,స్రి పాలి, బాల గంగధర్ తిలక్ అమ్రుతం కురిసిన రాత్రి చదివేపుడు ఎంత హాయినిస్తూ మనసుని ఆలొచింపచేస్తుందో సరిగ్గ అదేలా ...,
అర్తమయ్యె పదజాలముతో ,
ఆలొచింప చెసే భావాలతో ,
మనసుని కదిలించే ప్రస్నలతో.,
హ్రుదయానికి హత్తుకొనే విలువల కలయికల ఉంది .
మనిషిగా చఛిపోతూ, మానవనీయ సంబందాలు కనుమరుగవుతున్న నేటి తరం యువతకి ఈ ప్రబందం ఒక త్రోవ అని భావిస్తూ , ఇలాంటి ఏన్నో కవితలు మీ కలం నుండి ఏన్నో, మరెన్నో జారి వాలాని మన్స్పూర్తిగ కాంక్షిస్తూ .... @Rajesh(off line comment given by Rajesh)
'ఔరా భారతా!'
ఔరా అనిపించింది,
భారతీయమే మన మతమని విశ్వసించే
భారతీయులకు తెలుగింటి విందు భోజనమిది,
మనసారా నోరారా పద్యాలను పలికి
కడుపారా నోరూరా ఆరగించ పప్పన్నమిది,
ఒక్క సారి కాదు
రెండు సార్లు కాదు
పలు మార్లు
మళ్ళి మళ్లీ చదవాలనిపించే
నవీన పద్య శతకమిది.
జయహో సోదరా
a comment given by Ramachandra prasad.
గుంటూరు శేషేంద్ర శర్మ గారు చెప్పినట్లు ఒక కవి తన జీవితంలో ఒకే కావ్యం రాస్తాడు. అలా నా జీవితంలో నేను రాస్తున్న కావ్యం ఈ ఔరా భారతా. అందులో మొదటి మజిలీ ఈ శతకం. ఇది కథాంశంతో నడిచే కావ్యం కాదు. కాలంతో పాటూ సాగే ప్రయాణం !!. ఎప్పటికప్పుడు భూత భవిష్యత్ వర్థమాన కాలాలలో ఔరా భారతా !! అనిపించే విషయాలు ఇందులో ప్రస్థావిస్తూ అనంత సాగరాల వైపు పరుగులుతీసే నిత్య జీవన స్రవంతిలా ఈ కావ్య ప్రస్థానం సాగడంలో భగవంతుడి ఆశీస్సులతో పాటూ మీ ఆశీస్సులూ ఉంటాయని భావిస్తూ !!
- నవీన్