• Aunaa
 • Ebook Hide Help
  ₹ 30 for 30 days
  ₹ 76.8
  96
  20% discount
  • fb
  • Share on Google+
  • Pin it!
 • ఔనా...!

  Aunaa

  Author:

  Language: Telugu
  Rating
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  Be the first to vote
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

అందమైన అమ్మాయి, అద్భుతంగా పాడే కళాకారిణి, అధునికంగా ఆలోచించ కలిగే శక్తి వున్నది - కానీ జీవితాంతం చికిత్స చేసుకోవల్సిన డయాబిటీస్‌తో బాధపడుతూ వుంటుంది. అద్భుతమైన గాయకుడు శ్రోతలని పరవశింపచేసి ఆరాధింపచేసి తన్మయం చేయగలిగేవాడు మానసిక, శారీరక రుగ్మతలతో విపరీత ప్రవృత్తికి గురి అవుతాడు. పొట్ట కోసం వీడియోలు తీసుకునే సాధారణ వ్యక్తి ప్రవర్తనలో జుగుప్స గొలిపే 'వాయిరిజం' - కానీ అతని మనసులో స్వచ్ఛమైన ప్రేమ, బాధ - ఇతరులకి సాయం చేయాలనే ఆరాటం. పదిమందికి వైద్య చికిత్స చేసే లేడీ డాక్టర్‌ మనసులో అణుచుకోలేని ప్రేమ... దానికి తోడయిన అసూయా... ప్రేమకీ, అసూయకీ, మెడికల్‌ ఎథిక్స్‌కీ మధ్య సంఘర్షణా. రొమాంటిక్‌గా ఆలోచిస్తూ, బాడు బిల్డింగ్‌ చేస్తూ సాంప్రదాయ బద్ధంగా భార్యనే ప్రేమించి నిబద్ధతగా వుండే వ్యక్తి మనసులో, ప్రేమించిన వ్యక్తి పట్ల కాకుండ వివాహబంధం అంటే మక్కువ వుండడం... వీళ్ళందరి మధ్య జరిగిన కథే ఇది. ఒక మనిషి బయటకు కనిపించే రూపం, అంతరంగంలో అతని ప్రవృత్తి శరీరంలోని రుగ్మత, సాంఫిుకమైన కట్టుబాట్లు - వాటన్నిటి మధ్య జరిగే విచిత్రమైన 'ఇంటరాక్షన్‌' (సంఘర్షణ కాదు) - ఇదే మంచి సాహిత్యం అవుతుందని వీటిని ఉత్కంఠభరితంగా నిరూపించే తాపత్రయంతో రాసినదే 'ఔనా....!' నవల.

పాత్రల శారీరక, మానసిక, ఆంతరంగిక విశ్లేషణతో ఉత్కంఠ, శృంగారం, భావుకత కలిపి రాయాలని చేసిన ప్రయత్నాన్ని చూసి మీరు కూడ 'ఔనా..!' అని మెచ్చుకుంటారనే ఆశతో.....

- చిత్తర్వు మధు

Preview download free pdf of this Telugu book is available at Aunaa
Comment(s) ...

Ee navala ekkada bore kottadu. Madhyalo Vineela ni trap ninchi bayataki tappinchadam scenes anni chala tension ganu, suspense ganu unnayi. Chivara lo Vineela decision bagundi routine ga kakunda.

ఔనా నవల నేను రాసిన నవలల లో రొమాంటిక్ గా రాయడానికి ప్రయత్నించినది. అయినా నవలలో చివరికి మళ్లీ మెడిసిన్ జబ్బులు అన్ని వచ్చేసాయి .

ఆతను ఒక భావుకుడు. పాత పాటలూ నాగేశ్వర రావు సినిమాలూ ఇష్టం. యెవరూ లేరు అతనికి.అరెంజేడ్ మ్యారేజ్ లో పెళ్లి చేసుకుని ఆమెను హృదయపూర్వకం గా ఆరాధిస్తూ ఉంటాడు.అతను నిషాద్ .

ఆమె వినీల .ఆమె కి అతనంటే బోరు. ఆమె మంచి గాయని. తనకు గురువు గా సంగీతం

నేర్పించిన వ్యక్తి నీ పెళ్ళికి ముందు ప్రేమించింది.కళ్లు మూసుకుంటే అతనే గుర్తు వస్తాడు. అతను మళ్ళీ తన జీవితం లో కి వస్తాడని ఊహించలేదు.

ఇక మేఘన .డాక్టర్ .నిషాద్ ని ప్రేమించి విఫలం అయింది.అతని గురించే ఆలోచిస్తూ ఉంటుంది.అయితే అదే నిషాద్ భార్య కి వైద్యం చేయాల్సి వచ్చేస్సరికి ఒక పక్క స్త్రీ సహజమయిన అసూయ మరొక పక్క వృత్తి ధర్మం... సంఘర్షణ లో తప్పులు చేస్తుంది. నాకు మేఘన అంటే ఇష్టం...

ఈ కధలో విలన్ సంగీతం మాస్టర్ .రాగతరంగిణి లో అమ్మాయిలకు పాఠాలు చెప్పుతూ పర్వర్శన్స్ తో ప్రవర్తించే వ్యక్తి.వో వసంత భామినీ వినీల జీవితం లో మళ్ళీ ప్రవేశించిన మనిషి.విజయచంద్ర . ఇక పోతే.. యాదగిరి...వాయుర్ .వీడియో గ్రాఫర్ .అతనికి ఇతరుల జీవితాలను తన కెమెరా తో దొంగతనం గా చూడటం అలవాటు.

మంచి వాడా ? చెడ్డ వాడా? ప్రతి మంచి లో ఒక చెడ్డ...ప్రతి చెడ్డలో ఒక మంచి .వివీల వెనక నిషాద్.నిషాద్ వెనక మేఘన. విజయచంద్ర వెనక వినీల.వీరందరినీ రహస్యం గా చూస్తూ యాదగిరి..అందరూ వుండేది అపర్ణా కాంప్లెక్స్ ఫ్లాట్స్ లో..

ఇదే ఔనా నవల లోని వింత కథ . చిత్రీకరించడం లో ఎంతవరకు సఫలం అయ్యానో తెలియదు.... దొరికితే చదవండి ! ...from my Telugu blog madhubhaashini.