• Atyacharalapai Akshara Poratam
  • Ebook Hide Help
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అత్యాచారాలపై అక్షర పోరాటం

    Atyacharalapai Akshara Poratam

    Author:

    Publisher: Victory Publishers

    Pages: 200
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అనిత, భరత్‌ సురేష్‌ని అతని ఆఫీసులో కలిసి తాము చేపట్టిన ప్రాజెక్టు గురించి వివరించి తాము అక్కడికి వచ్చిన కారణం గురించి చెప్పారు. తమకి సహకరించమని అతనిని కోరారు.

''మీరు హేమ మీద అత్యాచారం చెయ్యడనికి ఎందుకు ప్రయత్నించారు?'' అనిత అడిగింది.

''నేను అటువంటి ప్రయత్నం చెయ్యలేదు.''

''దయచేసి నిజం చెప్పండి'' అడిగింది.

''నేను తన మీద అత్యాచారం చెయ్యడనికి ప్రయత్నించానని హేమ పోలీసులకి ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారించి నేను అటువంటి ప్రయత్నం చెయ్యలేదని నిర్ధారించారు.'' జవాబిచ్చాడు.

''మీరు మీ సెక్రటరీలని తరచుగా మారుస్తారని విన్నాము. నిజమేనా?'' భరత్‌ అడిగాడు.

''నిజమే''

''ఎందుకు?'' అడిగాడు.

''............'' అతను జవాబివ్వలేదు.

''మీరు మీ సెక్రటరీలని పార్టీలకి, షికార్లకి రమ్మని బలవంతం చేస్తారని విన్నాము నిజమేనా?'' అనిత అడిగింది.

''ఇన్‌వైట్‌ చేస్తాను. కాని బలవంతం చెయ్యను.''

''ఎందుకలా ఇన్‌వైట్‌ చేస్తారు?''

''వాళ్లు కూడా నాతో పాటూ ఆఫీసులో కష్టపడి పనిచేస్తారు. విసుగు చెందకుండా పనిచెయ్యాలంటే వాళ్లకి కూడా అప్పుడప్పుడు రిక్రియేషన్‌ కావాలి. అందుకే వాళ్ళని పార్టీలకి ఇన్‌వైట్‌ చేస్తుంటాను.''

''మీ ఆఫీసులో పనిచేస్తున్న జెంట్స్‌కి కూడ రిక్రియేషన్‌ అవసరమే కదా! మరి వాళ్ళనెప్పుడూ డిన్నర్‌లకి ఆహ్వానించరెందుకు?''

''ఆఫీసు తరపున పార్టీ ఏర్పాటు చేసినప్పుడు ఆఫీసులోని లేడీస్‌ని, జెంట్స్‌ని అందరినీ పిలుస్తాను. నేను పెర్సనల్‌గా ఇచ్చే డిన్నర్‌లకి నేను ఇష్టపడిన వాళ్లనే పిలుస్తాను. అది నా ఇష్టం''.

Preview download free pdf of this Telugu book is available at Atyacharalapai Akshara Poratam