-
-
అట్టాడ అప్పల్నాయుడు సాహిత్యం-1
Attada Appalnaidu Sahityam 1
Author: Attada Appalnaidu
Publisher: Srikakula Sahiti
Pages: 523Language: Telugu
ముప్పై అయిదేళ్ళుగా సాగుతున్న సామాజిక, ఆర్థిక సాంస్కృతిక చలనాలన్నీ 'పోడు-పోరు'తో ఆరంభించి ఇటీవల వచ్చిన "బీల" కథాసంకలనంతో సహా మధ్యలో ప్రచురించిన నవల, నాటకాల ద్వారా ఇక్కడి జనజీవన సర్వస్వాన్నీ "యాససర్వం రూపకం, రూపకమంతా కవిత్వం" అన్నట్లుగా అప్పల్నాయుడు అక్షరీకరిస్తున్నాడు. అప్పల్నాయుడి - యాసతో కూడిన శైలీఘరిలో ఇక్కడి చమత్కారం, సామెతా, హాస్యమూ, వ్యంగ్యం అంతర్వాహినులుగా ప్రవహిస్తూ కళింగ సాంస్కృతిక హోరుని వినిపిస్తాయి. గత ముప్పై అయిదేళ్ళలో వచ్చిన అప్పల్నాయుడి సాహిత్యాన్ని క్రమాను గతంగా పేర్చి చూస్తే వర్తమాన సామాజిక చరిత్ర మన కళ్ళకు దృశ్యమాన మౌతుంది. దీనిలో ముడిపడి వున్న అప్పల్నాయుడి స్వీయ చరిత్ర కథనమూ మనకవగతమవుతుంది. ఈ నేపథ్యంలో ఇంతటి సాహిత్య సృజన చేసిన అప్పల్నాయుడి సాహిత్యంలోని ప్రధాన ప్రక్రియా విభాగాలను మూడు సంపుటాలుగా ప్రచురిస్తున్నాము.
అప్పల్నాయుడు రాసిన 33 కథలున్న మొదటి సంపుటం ఇది.
- శ్రీకాకుళ సాహితి, మిత్రసాహితి, స్నేహకళాసాహితి
ఉత్తరాంధ్ర గుండెచప్పుడు - అట్టాడ అప్పల్నాయుడు సాహిత్యం పై ఈనాడు ఆదివారం అనుబంధంలో వచ్చిన సమీక్ష
http://teblog.kinige.com/?p=3345