• Atmiyulu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఆత్మీయులు

    Atmiyulu

    Publisher: J.V.Publications

    Pages: 144
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"ఎటువంటి వర్ణనలూ, విపరీతమైన భావావేశాలూ, విలన్లూ లేకుండా సరళంగా, సహజంగా చెప్పడం ఇష్టం నాకు.” ఈ మాట ఎవరిదో కాదు “ఆత్మీయులు' కథల సంపుటి రచయిత్రి డా. లక్ష్మి రాఘవగారి మాట. చెప్పడం వేరు, చెప్పిన మాట మీద నిలబడ్డం వేరు. లక్ష్మిగారు నూటికి నూరుపాళ్ళు తను అనుకున్న ప్రకారమే ఏ వర్ణనలూ లేకుండా సింపుల్‌గా, సూటిగా ఈ కథలన్నీ వ్రాశారు.

సామాన్యంగా 'కథ' అంటేనే కల్పనని కొద్దో గొప్పో బంగారంలో రాగిలా కలపడం. డా. లక్ష్మి రాఘవగారివి కథలు కావు. ఆమె వ్రాసేవన్నీ సంఘటనల సమాహారాలు. ఆ సంఘటనలు ఎక్కడినుంచో, ఏ భాషనించో ఏ దేశంనుంచో పట్టుకొచ్చినవి కావు. మన ముందు, ఒక్కోసారి మన ఇంట్లో జరిగేవే! అయితే మనం వాటిని పట్టించుకోం. పట్టించుకున్నా, కథగా మలచుకునే ఆలోచన రాదు. అంత సూక్ష్మపరిశీలన మనం చెయ్యం కనుక.

కథల్లో రచయిత్రిగా లక్ష్మిగారు ఎక్కడా కనిపించరు. ఏ పాత్రకీ తన వ్యక్తిత్వాన్ని ఆపాదించుకోరు, తామరాకుమీద నీటిబొట్టులా కథను కథగానే, పాత్రని పాత్రగానే పరిగణిస్తూ రాస్తారు. పరిణితి చెందిన రచనకి ఇదో నిదర్శనం!

ఇంకా చెప్పాలంటే, డా. లక్ష్మి రాఘవగారు వయసును జయించారు. మనసుని మాత్రం 'ఊహల పందిరి'లో కాక పరిగెడుతున్న కాలంతోబాటు పయనింపజేస్తూ వున్నారు. అందువల్లే అన్ని కథల్లో ఓ నవ్యత్వం, ఓ జీవత్వం మనకి కనబడతాయి. ఎప్పుడో జరిగినట్లు కాకుండా ఇప్పుడే మన కళ్ళముందు జరుగుతున్నట్టు అనిపిస్తుంది. వాక్పటుత్వానికీ, అక్షర పటుత్వానికి ఈ కథలు నిదర్శనాలు. చెప్పాలని చెప్పినట్టు కాకుండా ఆల్‌మోస్ట్ ప్రతి కథా ఓ సందేశాన్ని మన జ్ఞాపకాల తోటలో వదలి వెడుతుంది. పుస్తకం చదవటం మొదలు పెడితే, చివరివరకూ కథలు వాటంతట అవే మనల్ని చదివిస్తాయి. అంతేకాదు, మన మనస్సులో తిష్ట వేస్తాయి కూడా!

- భువనచంద్ర

Preview download free pdf of this Telugu book is available at Atmiyulu