-
-
ఆత్మార్పణ
Atmarpana
Author: Pemmaraju Venugopala Rao
Publisher: Vanguri Foundation of America
Pages: 399Language: Telugu
రావుగారు భాష విషయంలో తెలుగు జానపదుడు, భావ ప్రకటనలో - 'నా యిచ్ఛయేగాక నాకేటి వెరపు' - అనేటంతటి స్వతంత్ర్యుడు. ఆయన అచ్చమైన తెలుగు ఏలూరు మనిషి. ఆయనలో కవిత్వశిల్పం కాదు మనం చూడవలసినది; ఉప్పొంగే నిసర్గ భావధారని.
- ఇంద్రగంటి శ్రీకాంతశర్మ
సమాజంలోనూ, సాహిత్య ప్రపంచం లోనూ తనకున్న ఉన్నత స్థాయిని అతిశయంతో కాకుండా సరి అయిన దృక్పధంతో తూకం వేసుకుని, అనేక మందికి స్ఫూర్తి ప్రదాత అయిన మహానుభావుడు పెమ్మరాజు గారు. నాకు తెలిసినంతవరకు ఎంతో మంది భారతీయుల మధ్య తెలుగు భాషే ఊపిరిగా, తెలుగు కళారూపాలే ప్రాణప్రదంగా జీవిస్తూ తెలుగు జాతికి అమెరికాలో ఒక ఉనికిని కలిగింఇచ్న తొలి ప్రవాస భారతీయుడు.
- వంగూరి చిట్టెన్ రాజు
ఏదైనా వస్తువుని సూక్ష్మ వివరాలతో వర్ణిస్తున్నప్పుడు చిత్రకారునిగా, పదాలని జాగ్రత్తగా ఎంచి కూర్చుతున్నప్పుడు శిల్పిగా విషయాన్ని లోతుగా తరచి చూస్తున్నప్పుడు శాస్త్రవేత్తగా, అంతరంగాన్ని ఆవిష్కరిస్తున్నప్పుడు నటునిగా - ఇలా అన్ని రంగాల అనుభవం కవిత్వంలోనే వ్యక్తమౌతాయి. అందువల్ల కవిత్వమే ఆయన వ్యక్తిత్వాన్ని నిలువుటద్దంలా ప్రతిబింబిస్తుంది.
- విన్నకోట రవిశంకర్
He was a true seeker of knowledge, always searching for ways to better himself and those around him by taking what he learned and applying it to his own life. He was one of the few people who could truly use every part of his brain productively,switching easily from a conversation about a particular style of poetry to an in depth discussion on quantum physics.
- Nalini and Saleena
