-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
ఆత్మానందం (free)
Atmanandam - free
Author: Ram Dokka
Publisher: Self Published on Kinige
Pages: 256Language: Telugu
ఒక పద్యం, కవిత లేదా పాట పుట్టాలంటే, అంతరంగంలో అనవరతం ఎన్నో ఆలోచనా తరంగాలు, మస్తిష్కంలో రేబవళ్ళు ఎన్నో మాటల యుద్ధాలు. అయితే, వీటికి కర్త, కర్మ ఎవరు? స్ఫూర్తి, ప్రేరణ ఎవరు? నిజంగా మనమే వ్రాస్తున్నామా? లేక కేవలం మన ద్వారా ఇవి వ్రాయబడుతున్నాయా?
మన రచనల ద్వారా మనం ఏ ప్రయోజనం ఆశిస్తున్నాము? ఏమీ ఆశించకుండా మనకోసం మనం వ్రాసుకోలేమా? మనతో మనం స్వేచ్ఛగా మనసు విప్పి మాట్లాడుకోలేమా? మన రచనే ఒక దర్పణంగా, అందులో మన అంతరంగాన్ని మనం దర్శించుకొనే ప్రయత్నం చేసుకోలేమా?
మనిషికీ మనిషికీ జరుగుతున్నదేమిటి? ప్రకృతిని మనిషి శాసింపగలడా? ఇంత విశాల సృష్టిలో మనమెక్కడ? మనమెంత? మనలోని మనిషిని గుర్తుపట్టి, మనకోసం మనం, మానవ జీవిత పరమార్థాన్ని సరిగ్గా నిర్వచించుకోగలమా?
దైవం యొక్క ఉనికి ఏమిటి? మన వెనుక ఉండి వెన్ను తట్టే శక్తి మాత్రమేనా? లేక మానవరూపంలో అనేక ప్రతిబింబాలలో ప్రపంచం అంతటా విస్తరించి వున్న ఆత్మ స్వరూపమే పరమాత్మ తత్త్వమా? దీనిని దర్శించి, అనుభవించే ప్రయత్నం చేస్తే కలిగే అమితానందం ఎలా వుంటుంది.
ఇటువంటి ప్రశ్నలకు అక్షర రూపం ఇచ్చే ప్రయత్నంలో, వికసించిన కొన్ని వచన కవితాపుష్పాలను కూర్చుకొని ఈ "ఆత్మానందం' సంపుటి వెలువడుతోంది. చదివి ఆనందిస్తారని, ఆశీర్వదిస్తారని ఆశిస్తూ...
- రామ్ డొక్కా
