-
-
ఆత్మ
Atma
Author: Suryadevara Rammohana Rao
Publisher: Model Publications
Pages: 182Language: Telugu
"ఫెడిళ్” మంటూ ఆకాశం బద్దలయినంత శబ్దం. కోయగూడెం చివరిలో వుంది ఒక పెద్ద పాక. గూడెం అంతా వర్షపు నీటితో జలమయం అయినట్లుంది.
పాక లోపల నులక మంచం మీద మృత్యువుకు చేరువుగా వున్నాడొక వ్యక్తి. వయసు అరవై వుంటుంది. లోపల నూనె దీపం చిన్నది వెలుగుతూ వుంది.
గోడకు వ్రేలాడదీయబడి వున్నాయి విల్లు అమ్ములపొది.
అది కోలయ్య పాక. మంచం మీదున్న వ్యక్తి కోలయ్య. కొన్ని సంవత్సరాల క్రితం ఆ ప్రాంతాలలోని కోయగూడేలన్నీ ఎవరి పేరు చెబితే గజ-గజలాడిపోయేవో ఆ వ్యక్తి కుక్కి మంచంలో... మరణానికి చాలా చేరువలో.
అతనే కోలయ్య. కిన్నెరసాని వాగు గూడేనికి పెద్దగా జీవించిన కోలయ్య పాతిక సంవత్సరాలయింది మంచం మీదికి చేరుకుని.
అందుకు కారణం వున్న ఒకే కుమార్తె కిన్నెర దారుణమయిన మరణం. ఆ వార్త వింటూనే ముందుగా అతని భార్య పోయింది.
తన కుమార్తె చనిపోయిందానికి కారణం ఏమిటో తెల్సి కూడా ఏమీ చేయలేకపోయాడు కోలయ్య.
ఉప్పెనలాంటి అతని పౌరుషం అణగారిపోయింది. కిన్నెర చావు వల్ల అతను కోలుకోలేకపోయాడు.
గూడెం అంతా గాఢ నిద్రలో మునిగిపోయింది.
ఎవరిదో స్త్రీ ఆకారం నెమ్మదిగా ఆ పాకను సమీపించింది.
నెమ్మదిగా లోపలికి అడుగు పెట్టింది.
పరిచయమున్న ఆ సవ్వడికి మెల్లగా తలత్రిప్పి చూసాడు కోలయ్య. ద్వారం వద్ద నిల్చుని వున్న యువతి ఆకారం అస్పష్టంగా కనిపించిందతనికి.
"ఎవరది?" నూతిలోంచి వినవచ్చింది ఆ స్వరం.
నెమ్మదిగా మంచం వైపు కదిలిందా ఆకారం.
"నేను... నేను అయ్యా!"
"కి...న్నె...రా... నా బంగారు తల్లీ... నువ్వా.... నువ్వు బ్రతికే వున్నావా?"
"కాదు నాన్నా... నేనిలా కావడానికి కారకుడయిన వ్యక్తిని, మిమ్మల్ని ఈ స్థితికి తెచ్చిన వ్యక్తిని అంతం చేయడానికి నేను మళ్ళీ ఈ రూపం దాల్చక తప్పలేదు"
"అంటే... అంటే నువ్వు దయ్యమయ్యావా కిన్నెరా!"
"అయ్యా! నేను దయ్యమయినా, పిశాచ్చానయినా మీ కిన్నెరనే. మీరు ఆఖరి క్షణాల్లో వున్న విషయం తెల్సి చూడటానికి వచ్చాను... మీరిలా కావడానికి కారుకులెవరయిందీ నాకు తెల్సు. ఇంతకంటే దారుణంగా అనుక్షణం నరకం అనుభవించాలి చిత్రవధ అనుభవించి మరీ చావాలి"
"వద్దు... వద్దు కి...న్నె...రా..."
"క్షమించు అయ్యా! సమయం మించి పోయింది. అంతేగాదు, నా పగ చల్లారకపోతే నేను శాశ్వతంగా యిలా గాల్లో గాలినై, ధూళిలో ధూళినై వుండవలసిందే"
"కి...న్నె...రా...!"
అదే అతని ఆఖరి ఆక్రందన.
నూనె దీపం పోయింది.
కోలయ్య ఆత్మ అనంతంలోకి దూసుకుపోయింది.
నిశ్శబ్దంలో ఒక లీలా మాత్రం వేడి సెగల బుసలాంటి శబ్ధంలో చీకటిలో కల్పిపోయింది కిన్నెర రూపం.
అప్పుడే ఆ పాక వైపు వచ్చిన ప్రక్క పాకల్లోని వారందరూ కొద్ది క్షణాల తరువాత తెల్సుకోగలిగారు కోలయ్య చనిపోయాడని.
క్షణాల్లో ఈ వార్త మిగిలిన గూడెం అంతా ప్రాకిపోయింది.
నాకు తెలిసి ఈ నవల యస్.ఆర్.ఆర్. గారు రాసింది కాదు
Is this book available for rent?
Nothing great, pls avoid this book.
Bakwas