• Atiratra Mahayaga Samkshipta Parichayam
  • Ebook Hide Help
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అతిరాత్ర మహాయాగ సంక్షిప్త పరిచయం

    Atiratra Mahayaga Samkshipta Parichayam

    Publisher: Shri Veda Bharathi

    Pages: 63
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

దేశంలో అనేక ధార్మిక సంస్థలు, ఆశ్రమాలు, మఠాలు, మందిరాలు, ఇంకా ఎన్నో సంస్థలు, ఎందరో మహానుభావులు వేదవిద్యను పరిరక్షించుకోవాలని, వేదమాత యొక్క అనుగ్రహాన్ని యజ్ఞయాగాల అనుష్ఠానం ద్వారా సమాజంలోని పదిమందికీ అందించాలనీ, దానిద్వారా సుఖశాంతులతో విలసిల్లే సమాజాన్ని దర్శించాలనీ, నిరంతరం కృషిచేస్తున్నారు. దానికి సంబంధించిన వనరులను, వసతులను, వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నారు. వృద్ధిచేస్తున్నారు. తిరిగి వేదాలలో ప్రతిపాదించబడిన కర్మానుష్ఠానము చిగుళ్ళువేసి, పువ్వులు పూసి, కాయలుకాసి, ఫలాలుగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదంతా ధర్మస్వరూపుడైన జగన్నాథుని యొక్క అనుగ్రహంగా భావించవలసి ఉంది.

అయితే, ఈ సందర్భంలో కొన్ని ప్రాథమికమైన విషయాలను మనం కూడా తెలుసుకోవలసి ఉంది. ముఖ్యంగా - వేదం అంటే ఏమిటి? మంత్రం అంటే ఏమిటి? యజ్ఞం అంటే ఏమిటి? అతిరాత్రం అంటే ఏమిటి? దీని నిర్మాణాన్ని ఎట్లా చేస్తారు? ఆ యజ్ఞంలో ఇమిడి ఉన్న ప్రధాన అంశాలేమిటి? వీటిగురించి పూర్వం నుండి మనకు లభించిన అనుభవజ్ఞానం ఏమిటి? - ఇటువంటి విషయాలను సంక్షిప్తంగా అందించాలనే ఉద్దేశ్యంతో ఈ చిన్ని పుస్తకాన్ని సంకలనం చెయ్యడం జరిగింది. దీనిద్వారా మన ప్రాచీన జ్ఞాన వైభవాన్ని కొంతవరకైనా తెలుసుకున్నవాళ్ళమవుతామని ఆశ ! పరమేశ్వరుడు మనందరికీ ధర్మాచరణ చేయాలనే సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుకుందాం !

- డా. రేమెళ్ళ అవధానులు

Preview download free pdf of this Telugu book is available at Atiratra Mahayaga Samkshipta Parichayam