-
-
అతను
Athanu
Author: Madhubabu
Publisher: Sri Srinivasa Publications
Pages: 357Language: Telugu
ఎనభై అంకెని దాటి వంద దగ్గిరికి చేరుకుంది స్పీడోమీటర్ లోని ముల్లు. శబ్దాన్ని మించిన వేగంతో ప్రయాణంచేసే సూపర్ జెట్ విమానం మాదిరి మోతలు చెయ్యడం మొదలుపెట్టింది అంబాసిడర్.
"ఇప్పుడు గనుక ఈ రోడ్డుమీద జనం ఎవరైనా మనకి అడ్డంవస్తే..." అంటూ ఆపైన ఊహించడానికి భయపడ్డాడు రాంసింగ్.
వందని దాటింది ముల్లు. రోడ్డు కనిపించడం మానేసింది. నూటపది - నూటఇరవై... ఆ అంకెని దాటడం మాత్రం అతనికి చేతకాలేదు. కారు రెస్పాండ్ అవకకాదు, యాక్సిలేటర్‌ని అదిమినకొద్దీ పెరుగుతోంది స్పీడు. స్పీడ్ పెరిగినకొద్దీ భూకంపంలో చిక్కుకుపోయినట్టు కంపించిపోతూ, ఎగిరి అవతల పడిపోతున్నాయి, గుట్టమీదినించి దొర్లడంవల్ల దెబ్బతిన్న పార్టులు.
వెనుకడోరు కూడా ఎగిరిపోయింది. డిక్కీ దానంతట అదే లేచి ఏ క్షణంలోనైనా ఎగిరిపోవడానికి సిద్దంగా వుంది. దానంతట అదే కదిలి ముందుకు జరిగింది వెనుకసీటు. గతుకుల్లోపడి కారు జర్క్‌లు ఇచ్చినప్పుడల్లా అటూ ఇటూ ఊగిపోతోంది. "స్లో చేయడం మంచిది చిన్నబాబూ! పాతకారు కదా... ఈ స్ట్రెయిన్ భరించలేకపోతోంది" రెండు నిముషాల తర్వాత నెమ్మదిగా చెప్పాడు రాంసింగ్.
ఆ మాటల్ని వినిపించుకోవడం దీపక్కి ఇష్టంలేకపోయింది. మొండిగా అలాగే స్టీరింగ్‌ని పట్టుకుకూర్చున్నాడు. పదినిముషాల తర్వాత అతనికి అగుపించింది సిటీ ఎంట్రన్స్‌లో పందెం నిర్వాహకులు ఏర్పాటు చేసిన స్వాగత తోరణం. గుంపులు గుంపులుగా నిలబడివున్నారు జనం.
చప్పట్లతో, ఈలలతో, కేకలతో కేరింతలు కొడుతూ అతనికి స్వాగతం పలికారు.
"ఇట్స్ ఎమేజింగ్... చాలా గొప్ప విషయం. కారు పందేలలో ఇంతవరకూ పార్టిసిపేట్ చేయని ఒక కాలేజీ స్టూడెంట్ అందరికంటే ముందుగా సిటీలోకి ఎంటర్ కావడం రియల్లీ ఫెంటాస్టిక్..." అంటూ ఎనౌన్స్‌మెంట్లు వినిపించింది అక్కడ అరేంజిచేయబడిన మైకు.
Typical Madhubabu novel... good read for evening.if you want to kill some time go for it.
This novel is now available in Tenglish script with Kinige. For details, follow the link.