-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
ఆటవెలది శతకము (free)
Ataveladi Satakamu - free
Author: T. Sudhakar Babu
Publisher: Self Published on Kinige
Pages: 33Language: Telugu
Description
ప్రేమ వేలుపునికి ప్రేమతోనివ్వాళి
కరుణ జూపు మయ్య కనికరముతొ
నాదు దోషములను నీదు ప్రేమను జూపి
పరిహరించ వయ్య పరమపురుష.
***
మూడు అక్షరముల ముక్కంటి వేలుపు
ముజ్జగంబులకును మూలమతడె
మదము జూప మనల మసినిజేయగలడు
మురిపములతొ కొలువ మోక్ష మిచ్చు.
***
తల్లి చెఱను పోరి తప్పించె గరుడుడు
తల్లి ముదము నంద తనివి తీర
తల్లి ఋణము దీర్చ తరము కాకున్నను
తల్లి కోర్కె దీర్ప తనయుడతడె.
Login to add a comment
Subscribe to latest comments
