-
-
అతను - ఆమె - కాలం
Atanu Aame Kalam
Author: G.S. Lakshmi
Publisher: Self Published on Kinige
Pages: 200Language: Telugu
ఇందులో 23 కథలున్నాయి. దేనికది ప్రత్యేకత సంతరించుకున్నాయి.
కథలకు ప్రాణం కథనం. చెప్పాల్సిన విషయాన్ని ఎక్కడ మొదలుపెట్టి ఎలా ముగిస్తే పాఠకుణ్ని ఆకట్టుకుంటుందో లక్ష్మిగారికి బాగా తెలుసు.
కథకి కావల్సినంత మేరనే భాషని వాడడం... ఆ భాష సరళంగా వుండడం చదువరిని కథలోకి తీసుకెళ్ళడానికి ఎలాంటి ఇబ్బందికి గురిచేయకుండా నల్లేరు మీద బండిలా సునాయాసంగా కథ వెంబడి మనల్ని పరుగులు తీయించడంలో లక్ష్మిగారు సఫలీకృతులయ్యారు.
సహజంగా హాస్య ప్రియత్వం వున్న లక్ష్మిగారు చాలా సార్లు నవ్వుతూ నన్ను ఆగిపోయేలా చేసేరు. మరి కొన్ని చోట్ల బాధతో హృదయం మెలిపడేలా చేసేరు. సమాజంలో జరుగుతున్న మార్పుల పట్ల సునిశిత దృష్టి, వాటి పట్ల ఒక అనుకూల దృష్టి.... వాటిని ఏ విధంగా సమర్థించుకుని సరికేసుకోవాలో అనే అవగాహనతో కథలన్నీ ముందుకు సాగేయి.
ఏదో ఒకటి చెప్పేద్దామని కాకుండా రచయిత్రిగా తనకున్న సామాజిక బాధ్యతని గుర్తెరిగి చాలా సామర్థ్యంతో ప్రతి కథ గుండెకు హత్తుకుని మనసుకి ఎత్తుకుని రాశారనిపించించి నాకు.
ఇక శైలి సరేసరి! ఆ తీగెపాకం గురించి ఎంత చెప్పినా సరిపోదు. ప్రతి కథా ద్రాక్షపాకమే.
- మన్నెం శారద, సుప్రసిద్ధ రచయిత్రి.
ఈ పుస్తకంపై పుస్తకం.నెట్లో వచ్చిన వ్యాసం http://pustakam.net/?p=18996