• Atani Aksharam Meeda Chevi Petti Vinandi Sabbani Laxminarayana Abhinandana Sanchika
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 129.6
    144
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అతని అక్షరం మీద చెవి పెట్టి వినండి సబ్బని లక్ష్మినారాయణ అభినందన సంచిక

    Atani Aksharam Meeda Chevi Petti Vinandi Sabbani Laxminarayana Abhinandana Sanchika

    Pages: 176
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అతని అక్షరం మీద చెవి పెట్టి వినండి .( ఉద్యోగ విరమణ & సాహిత్య జీవిత అభినందన సంచిక )
సబ్బని లక్ష్మీ నారాయణ గారి 36 ఏళ్ళ సాహిత్య జీవితము, 32 ఏళ్ళ ఉద్యోగ జీవితము పై 176 పేజీలతో 160 మంది సాహితీవేత్తలు ,కవులు, కళాకారులు, రచయితలు , సబ్బని మిత్రులు, అభిమానుల రచనలతో వెలువడిన అభినందన సంచిక ఇది. దీనికి సాహితీ మిత్రులు సంకేపల్లి నాగేంద్ర శర్మ గారు సంపాదకత్వం వహిస్తూ ఇది సబ్బని సాహితీ సాగరం అని కొనియాడారు. సబ్బని తన సాహిత్య జీవితములొ " శరత్ సాహితీ కళా స్రవంతి , కరీంనగర్" ( 1999),, " తెలంగాణ సాహిత్య వేదిక, కరీంనగర్ " (2001) అను సంస్థలను స్థాపించి వాటి వెలుగులో 25 వరకు వివిధ సామాజిక అంశాలపై పుస్తకాలను ప్రచురించారు . రచన చేయడం ఒక సామాజిక భాద్యత అని నమ్మిన సబ్బని ఒక్క తెలంగాణ పైనే 12 కు పైగా పుస్తకాలు ప్రచురించారు 2001 నుండి 2014 వరకు తెలంగాణా ఉద్యమ కాలములో .
" కవిగా, వ్యాస కర్తగా , అధ్యాపకుడిగా, గీత రచయితగా బహుముఖీన రంగాల్లో తన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించిన శ్రీ సబ్బని లక్ష్మీ నారాయణ నిరంతర సాహితీ కృషీవలుడు " అని డా. సి. నారాయణ రెడ్డి గారు అభినందనలు తెలిపారు. డా. ఎన్. గోపి, ప్రొ. జయధీర్ తిరుమల రావు, డా. నందిని సిధారెడ్డి, డా. మసన చెన్నప్ప, డా . అంపశయ్య నవీన్, డా . అద్దేపల్లి, డా . ద్వా.నా . శాస్త్రి, కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి ,డా . రాధేయ, సాత్యకి, డా . మలయ శ్రీ, డా . నలిమెల భాస్కర్, శ్రీ కాట్రగడ్డ లక్ష్మీ నరసింహా రావు, బోయినపల్లి హనుమంత రావు, డా. మచ్చ హరిదాసు, డా. రావి రంగా రావు, ప్రొ. ఎస్వీ సత్యనారాయణ, డా. తిరునగరి, ప్రొ. బన్న అయిలయ్య, ప్రొ. వెలుదండ నిత్యానంద రావు, వెల్దండి శ్రీధర్, శ్రీమతి హైమవతీ భీమన్న, డా. రాపోలు సత్యనారయణ, డా.. వేదగిరి రాంబాబు, గన్ను కృష్ణమూర్తి , డా. సంగనబట్ల నరసయ్య , శైలజామిత్ర , వేదకుమార్ , డా. పత్తిపాక మోహన్ ,డా. కాలువ మల్లయ్య , శ్రీ బి. ఎస్ . రాములు ,భీంపల్లి శ్రీకాంత్ , డా. కపిలవాయి లింగమూర్తి ,పరవస్తు లోకేశ్వర్ , డా. జైశెట్టి రమణయ్య, డా. నాగేశ్వర్ రావు లాంటి ప్రముఖుల రచనలతో ,సబ్బని సాహిత్యము పై, సామాజిక ఉద్యోగ జీవితముపై వెలువడిన అభినందన సంచిక ఇది. సాహిత్యం సమాజానికి ప్రతిబింబం అయితే సబ్బని అభినందన సంచిక " అతని అక్షరం మీద చెవి పెట్టి వినండి ." ఒక మచ్చు తునక లాంటి పుస్తకం చదువడానికి. సాహితీ వేత్త , ఉత్తమ అధ్యాపకులు సబ్బని లక్ష్మీ నారాయణ పై A4 సైజు లో వెలువడిన ఆణిముత్యం లాంటి పుస్తకం ఇది.

Preview download free pdf of this Telugu book is available at Atani Aksharam Meeda Chevi Petti Vinandi Sabbani Laxminarayana Abhinandana Sanchika