-
-
ఆటాడుకుందాం...రా!
Atadukundam Ra
Author: Dr. N. Vasanth
Publisher: Krishnagiri Zilla Rachayitala Sangham
Pages: 221Language: Telugu
తెలుగు జాతికి సొంతమైన ఆటలు కొన్ని వున్నాయి. పరిచయమైనవి మరికొన్ని వున్నాయి. అన్ని వయసుల, అన్ని ప్రాంతాల వారిని అలరింపజేసేవి ఈ ఆటలే.
మనిషిగా జీవించడం అంటే తినడం, నిద్రపోవడం, సంతానాన్ని కనడం మాత్రమేనా? అంతకంటే వేరేమైనా అర్థం, ప్రయోజనం వుందా? అని ప్రశ్నించుకుంటే ఆనందాన్ని పొందడమే జీవిత పరమార్థంగా కనిపిస్తుంది. ఈ ఆనందాన్ని సాధించుకోవడానికి ఆదిమానవుడు మొదలుకుని ఆధునిక మానవుడు వరకు రకరకాలైన వ్యాపకాల్ని క్రీడల్ని రూపొందించుకుంటూ రావడం జరుగుతోంది.
కొన్ని ఆటలు అందరికి అన్ని ప్రాంతాలకి సంబంధించినవి అయినా అవి వేరు వేరు ప్రాంతంలో పలు పేర్లతో పద్ధతులతో వ్యవహరింపబడుతున్నాయి.
ఈ పుస్తక రచయిత డా. ఎన్. వసంత్ గారికి ఆటలంటే ఇష్టం. అన్నంకంటే కూడా రచయిత తన బడి ఈడు సావాసగాండ్లతో ఆడిన ఆటల్ని జ్ఞాపకాల పొరల్నుంచి పైకి పెకలించి ఇంపైన కతలుగా మలిచి గ్రంధస్థం చేశారు. ఆటల్ని కథలుగా చెప్పడం ఒక ఎత్తయితే అందుకోసం వాడిన స్థానిక భాషాసౌందర్యం మరొక ఎత్తు. పై రెండు అంశాలు పరస్పరం ప్రభావితం చేసుకుంటూ రచనకి కొత్తదనాన్ని రసపుష్టిని కూర్చాయి. ఇదొక రచనా శిల్పం.
- కలువకుంట నారాయణ
గమనిక: " ఆటాడుకుందాం...రా!" ఈబుక్ సైజు 7.6 mb