• Atadu Vs Ame Plus Eme
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    180
    66.67% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అతడు Vs ఆమె + ఈమె

    Atadu Vs Ame Plus Eme

    Pages: 237
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 2 votes.
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 2 premium votes.
Description

ఈలోపల తీరిగ్గా-

హాల్లోకి వచ్చాడు శివాజీ.

అతడ్ని ఎగాదిగా చూసాడు తాతారావు.

“ఎవరీ అబ్బాయి? మీ డ్రయివరు ఇతడేనా?’’ అనడిగాడు.

“అవున్సార్‌! నా పేరు శివాజీ. ఈ ఇంటి డ్రయివర్ని. మీరు అపూర్వ మేడమ్‌ తాతగారా...? నమస్తే సార్‌! మీ గురించి విన్నాను. మిమ్మల్ని చూడ్డం చాలా సంతోషంగా వుంది. ఊరకే రారు మహానుభావులు అంటారు. మీ కొడుకులు రాయబారం ఏదన్నా పంపించారా?’’ అంటూ చాలా వినయంగా అడిగాడు.

“నా సంగతి అలా వుంచరా అబ్బాయ్‌! నిన్నెక్కడో చూసినట్టు వుందే? నీది ధూల్‌పేట ఏరియా కదూ?’’ కావాలనే ఓ రాయి విసిరాడు తాతారావు.

‘ఓరి ముసలినక్కా! నా గుర్తింపును బయటపెట్టాలని ప్లానా? అయిపోతావ్‌రోయ్‌’ అని మనసులో అనుకుంటూ పైకి చిరునవ్వు నవ్వాడు.

“మాది ఈ వూరు కాదు. ఇంకా చెప్పాలంటే మా వూరు చెన్నై. ధూల్‌పేట గుడుంబాకి పెట్టింది పేరు. గూండాలు, రౌడీలు తిరిగే ఏరియా. మీకు ధూల్‌పేటలో పనేమిటి సార్‌?’’ అనడిగాడు.

ఈసారి తాతారావు ఇరుకున పడ్డాడు.

“పని వుంటేనే వెళతారా ఏమిటోయ్‌... చూసిన గుర్తు అన్నాను. అంతేగా! మా వాళ్ళని కొట్టి మంచిపని చేసావ్‌. ఉండాలి.... నీలాంటి ధైర్యవంతుడు వుండాలి. నా మనవరాళ్ళంటే నాకు ప్రాణం. వీళ్ళు క్షేమంగా వుంటే నాకు చాలు. కాని నాకో డౌటు. నువ్వు మామూలు డ్రయివరువి, నీకీ కొట్లాటలు, గొడవలు అవసరమా?’’ అంటూ మరోసారి తన తెలివిని ప్రదర్శించాడు.

చురుగ్గా చూసాడు శివాజీ.

Preview download free pdf of this Telugu book is available at Atadu Vs Ame Plus Eme
Comment(s) ...

This book is the same novel: "Apoorva" just the title is changed

Time pass novel. Comedy is good in parts.