-
-
అతడు-ఆమె: మనం
Atadu Aame Manam
Author: Volga
Publisher: Swechcha Prachuranalu
Language: Telugu
అతడు-ఆమె: మనం
ఓల్గా
లోకంలో మంచి రచయితలూ ఉంటారు. గొప్ప వ్యక్తిత్వం కలిగిన మనుషులూ ఉంటారు.కానీ మంచి రచయితా, గొప్ప వ్యక్తీ ఒకడే అవడం చాలా అరుదుగా జరిగే విషయం. అటువంటి అరుదైన మనిషి లక్ష్మణరావుగారు. అరుదైన రచన "అతడు - ఆమె". లక్ష్మణరావుగారి వ్యక్తిత్వాన్ని ఆయన రచనల్నీ విడదీసి చూడలేం. ఆయన రచనలు ఆయన వ్యక్తిత్వంలో ఒక భాగం. ఆయన రచనల సారాంశమే ఆయన వ్యక్తిత్వం.
జాతీయోద్యమ నవలగా, స్త్రీ పురుష సంబంధాలను చర్చించే నవలగా 'అతడు - ఆమె'కు తెలుగు సాహిత్యంలో విశిష్టమైన స్థానం వున్నది. 'అతడు - ఆమె' నవలలో లక్ష్మణరావుగారు ఎన్నో విషయాలనో చర్చించారు. ఎన్ని విషయాల గురించో మన కళ్ళు తెరిపించారు. ఐతే ఈ నవల మొత్తంగా సాధించిన ప్రయోజనం ఏమిటి? ఈ నవల చదవక ముందూ, చదివిన తర్వాతా పాఠకుడి మనసులో వచ్చే మార్పులేమిటి అని ఆలోచిస్తే, 'అతడు - ఆమె' నవల పాఠకుల సంస్కారాన్ని పెంచడంలో ఎంతో ఉపయోగపడుతుంది. ఆ నవల చదివే వ్యక్తులు కొంచెం నిజాయితీ ఉన్నవారైతే చాలు - ఆ నవల చదివాక ఎంతగానొ సంస్కరించబడతారు.
