-
-
ఆశ్వలాయన గృహ్యసూత్రము
Aswalayana Gruhya Sutram
Author: Dr. N. L. Narasimhacharya
Publisher: Gayathri Prachuranalu
Pages: 252Language: Telugu
ఆశ్వలాయన గృహ్యసూత్రము
పరిచయం
ఆశ్వలాయన మహర్షి చాలా ప్రాచీనుడు. వేదవ్యాసమహర్షి శిష్యులలో ఎనిమిదవతరంవాడు. ఇతని తండ్రియైన అశ్వలుడు మహాభారతకాలంలో మిథిలనేలిన జనక చక్రవర్తి చేసిన బహుదక్షిణాకమైన యాగంలో హోతగా ఉండినట్లు తెలుస్తున్నది. ఆశ్వలాయనుడు కూడా మిథిలానగరప్రాంతంలో ఉండి ఋక్సంహితను ప్రచారంలోనికి తెచ్చినట్లు చెప్తారు. కాని మైక్డొనాల్డ్ మాత్రం ఈ మహర్షి కృష్ణాగోదావరీ నదుల మధ్య దేశమున ఉన్నట్లు, ఋగ్వేదానికి సంబంధించిన ఐతరేయారణ్యానికి చెందిన నాల్గవ కాండాన్ని కనుగొన్నట్లు తన సంస్కృతసాహిత్య చరిత్రలో చెప్తాడు.
శౌనకమహర్షి శిష్యుడైన ఆశ్వలాయన మహర్షి ఋగ్వేదాంగమైన కల్పసూత్రాన్ని రచించాడు. ఆ కల్పసూత్రంలో ఈ గృహ్యసూత్రం ఒక భాగం.
ఈ గృహ్యసూత్రంలో గృహస్థు ఐనవాడు తప్పక ఆచరించాల్సిన పుంసవనం, సీమంతం, జాతకర్మ, అన్నప్రాశన, చౌళము, ఉపనయనమ్, వివాహము మొదలైన పదునైదు సంస్కారాలతోబాటు షోడశకర్మయైన అంత్యేష్టిని, వాటిని ఆచరించు విధానాన్ని కూడా తెలిపినాడు.
సూత్రాలలో అతిసంక్షేపంగా ఉన్న ఈ షోడశకర్మలను తరువాతి కాలంలో చక్కని వివరణతో "ఆశ్వలాయన గృహ్యపరిశిష్ట"మను పేరుతో చేర్చినారు.
సంధ్యావందన పద్ధతి, స్నానవిధి, పుణ్యాహవాచనవిధి, భోజనవిధి, శయనించు పద్ధతి, వాస్తుపూజ మొదలగు ప్రకరణలతో ఉన్న ఈ ఆశ్వలాయన పరిశిష్టాన్ని కూడ పాఠకుల సౌలభ్యం కోసం తెలుగు అనువాదంతో కలిపి ఇవ్వడం జరిగింది.
అట్లే ఈ ఆశ్వలాయన గృహ్యసూత్రములోను, పరిశిష్టంలోను ఉన్న కొన్ని విశేష పదాలకు అర్థాలను కూడా ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది.
వైదికధర్మాలను తెలిసికొనగోరువారు, తదాచరణ చేయాలనే ధార్మికులు, ఋగ్వేదాన్ని ప్రత్యేకంగా మిక్కిలిశ్రద్ధతో అధ్యయనం చేస్తున్నవారు తప్పక చదవవలసిన గ్రంథరాజమిది.
- ₹162
- ₹540
- ₹360
- ₹270
- ₹360
- ₹162
- ₹162
- ₹540
- ₹360
- ₹270
- ₹360
- ₹162
I am looking for rules to abide by like "Following some traditions when somebody dies in the family or a close relative or a Gnaati, etc and also while a baby is born in the family, or in a close relative's family, etc".These are not found in this book. I read the preview of "Aaapa sthambha sutramulu" written by the same author but there also these details are missing. What the local purohits say differ greatly from one version to other's and they don't show any authentic document.
Please tell me where I will get those details.I read 4 ASTHAADASA PURAANAAs and in SRI KURMA MAHA PURAANAM ., these things are described at length!.But a BRAHMASRI GURU JI says PURAANAAS are not a yard stick....