-
-
అసూయ... అసూయ... అసూయ
Asuya Asuya Asuya
Author: Patti Sumathi
Publisher: Praja Paksha Patrika Vividha Bharati
Pages: 18Language: Telugu
ఆధునిక యుగ సాంస్కృతిక మత ధర్మ ప్రవర్తకుడు వివేకానంద స్వామి. కోట్లాది హిందువులు విద్యాహీనులై దరిద్రులై క్రుంగి కృశించి పోతుంటే వారి సముద్ధరణ కోసం కృషి చేయని విద్యాధికులు దేశద్రోహులని నా అభిప్రాయమంటారు వివేకానందుడు. వివేకానందుడు ద్వేషాన్ని విడనాడి ప్రేమతత్వాన్ని అలవర్చుకోమని ఉపదేశించారు. ఈ దేశప్రగతికి చిరకాలంగా ప్రజానీకంలోని పరస్పర ద్వేషభావనలే అవరోధంగా నిలుస్తున్నాయి. ఈ విషయాన్ని శ్రీమతి పత్తి సుమతిగారు ఈ చిన్న పుస్తకంలో స్పష్టం చేసారు. వివేకానందుని ఆలోచనా సరళిని ఆయన విశ్వమానవాళికి ఇచ్చిన సందేశ సారాంశాన్ని సరళ సుబోధకంగా అందించారు రచయిత్రి.
ఈర్ష్య, ద్వేషం, అసూయ, ప్రేమరాహిత్యం వంటి దుర్గుణాలు ఈ జాతిని పట్టి పీడిస్తున్న జాడ్యాలుగా గుర్తించిన రచయిత్రి - వివేకానందుడు ఈ దిశలోనే ఆలోచించి జాతిని జాగృతం చేసే ప్రయత్నం చేశారని, ఆయన ఆత్మ ఘోషని మనం అర్థం చేసుకోలేకపోయామని అభిప్రాయం వ్యక్తం చేసారు. కుల వ్యవస్థని తిరస్కరించాలని భావించిన రచయిత్రి జన్యు వైవిధ్యం ఈ జాతి సమస్యలకు ఒక పరిష్కారమని వైజ్ఞానిక దృష్టితో ప్రకటించారు. వివేకానందుని బోధనలను ఆధునిక దృక్పథంతో పరిశీలించి విజ్ఞాన దాయకమైన రచన గావించిన సుమతి గారిని అభినందిస్తూ...
- డా. దామెర వెంకట సుర్యారావు
