-
-
అశుద్ధ భారత్
Asuddha Bharat
Author: Bhasha Singh
Publisher: Hyderabad Book Trust
Pages: 212Language: Telugu
ఈ పుస్తకం ఎంతో విలువైనది, బలమైనది కూడా! పాకీపని గురించిన వాస్తవాలను భారతదేశంతో పాటు అంతర్జాతీయ సమాజం ముందు ఉంచటానికి, చైతన్యాన్ని పెంచటానికి ఈ పుస్తకం ఒక పనిముట్టుగా ఉపకరిస్తుంది. అలానే పాకీ పనివాళ్ళు తమంతట తాము ఒక కూటమిగా ఏర్పడటానికి, సమష్టిగా ఉద్యమంలోకి రావటానికి, తమ గొంతులను గట్టిగా వినిపించడానికి, తమ అవసరాలను, హక్కులను స్పష్టంగా చెప్పుకోగలగటానికి ఉపయోగపడుతుంది. పాకీపనికి మూలాధారంగా వున్న అంశాలను అర్థం చేసుకోవటానికి ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుంది. పాకీపనిని అంతమొందించటానికి తీసుకోవల్సిన విధాననిర్ణయాలు, ఆలోచనలకు బీజం వేసే క్రమంలో ఇదొక ముఖ్యమైన అంకం. కేవలం చైతన్యపరిచే ఉద్యమాలతో సరిపోదు – బలమైన రాజకీయ నిర్ణయాలు, చిత్తశుద్ధి కూడా ఎంతో అవసరం. ఈ రెండింటినీ తట్టిలేపడంలో ఈ పుస్తకం అత్యంత బలమైన సాధనం అనటంలో సందేహం లేదు.
- కాథరినా డె అల్బూకెర్క్యూ
