-
-
ఎసాల్ట్ ఆన్ షాడో
Assault on Shadow
Author: Madhubabu
Publisher: Madhubabu Publications
Pages: 207Language: Telugu
“మీతో కలిసి పని చేయటానికి ఒక గుండె చాలదు షాడో సార్... కనీసం నాలుగైనా కావాలి... క్షణంలో పదో వంతు కాలం ఆలస్యం అయినా ప్రక్కకు దూకి గురిలోనుంచి తప్పించుకునే ఈ దరిద్రపు ముఖాన్ని గురి తప్పకుండా కొట్టగలిగిన మీ గుండెను బహుశా ఉక్కుతోనో, నక్షత్రాల్లో లభించే ప్రత్యేకమైన లోహంతోనో చేసి వుంటాడు ఆ దేవుడు... సందేహం లేదు...” దారుణమైన చలి వేస్తున్నట్లు వణకిపోతున్న చేతుల్ని స్వాధీనంలోకి తెచ్చుకోవటానికి విఫల ప్రయత్నం చేస్తూ అన్నాడు విట్టోరియో ఫ్రండ్.
రివాల్వర్ లోని బుల్లెట్లు ఇంకోసారి పరీక్షగా చూసుకొని, పాంటు బెల్టు వెనుక భద్రపరుస్తూ, చేతిని అందించి అతన్ని లేపి నిలబెట్టాడు షాడో.
“నీ పొజీషన్లో నేనున్నప్పుడు నువ్వుకూడా నా మాదిరిగానే రెచ్చిపోయి ఎటాక్ ఇస్తావ్ మై ఫ్రండ్... ప్రమాదకరమైన పరిస్థితుల్లో అందరి గుండెలు గట్టిపడి ఉక్కు మాదిరిగానే తయారవుతాయి. ఇందులో నా ప్రత్యేకత ఏమీ లేదు...” అంటూ వెనక్కి తిరిగాడు.
తిరిగిన వెంటనే తగిలిందతనికి మరో పెద్ద షాక్.
