• Ashtavidha Nayikalu
  • Ebook Hide Help
    ₹ 135
    150
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అష్టవిధ నాయికలు

    Ashtavidha Nayikalu

    Publisher: J.V.Publishers

    Pages: 224
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

భారతీయ సాహిత్యంలో అలంకారశాస్త్రం విశిష్టమయింది. 'విశ్వశ్శేయః కావ్యమ్' అని నమ్మిన మన ఆలంకారికులు కావ్యాలలో కథ, కథనం, రసం, నాయికా నాయకుల లక్షణాలను నిర్దేశించి, వాటిని అనుసరించడం వల్ల కలిగే కావ్యప్రయోజనాలను విస్తృతంగా చర్చించారు. రెండు వేల సంవత్సరాల క్రితం భరతముని తన నాట్యశాస్త్రంలో అష్టవిధ నాయికలను ప్రస్తావించాడు. తరువాత దశరూపకం, సాహిత్యదర్పణం, ప్రతాపరుద్ర యశోభూషణం, కావ్యాలంకార సంగ్రహం మొదలైన సంస్కృతాంధ్ర గ్రంధాలలో ఈ నాయికల గురించి విశేషంగా వ్రాసారు.

ఎనిమిది విభిన్న లక్షణాలతో ఈ నాయికలు కనిపిస్తారు. మన కావ్య నాటకాలలో ఈ నాయికలకు ప్రతీకలుగా ఆయా పాత్రలు తీర్చిదిద్దబడ్డాయి. విభిన్న నాయికలలో ఈ లక్షణాలు విడివిడిగా కనిపించవచ్చు. లేదా ఒకే నాయికలో సందర్భానుసారం ఈ విభిన్న లక్షణాలు కనిపించవచ్చు. అష్టవిధ నాయికల లక్షణాలను, వివిధ కవుల చిత్రణ తదితరాంశాల గురించి ఈ పుస్తకం చివర అనుబంధంగా ఇచ్చిన వ్యాసాలలో చూడవచ్చు.

- కంది శంకరయ్య

అష్టవిధ నాయికలు అనగా, భరతముని రచించిన నాట్యశాస్త్రములో పేర్కొనిన ఎనిమిది రకాల నాయికలను కలిపి ప్రయోగించే పదం. ఈ ఎనిమిది రకాల నాయికల వివరణ వారి ఎనిమిది విధములైన మానసిక అవస్థలను తెలియజేస్తుంది. అష్టవిధ నాయికలు భారతీయ చిత్రకళ, సాహిత్యం, శిల్పకళ మరియు శాస్త్రీయ నృత్య సంప్రదాయాలలో తెలియపరచబడ్డారు. భారతీయ సాహిత్యంలో జయదేవుడు 12వ శతాబ్దంలో రచించిన గీతగోవిందంలోను, వైష్ణవకవి వనమాలి రచనలలో రాధ వివిధ నాయికల భూమిక పోషించి, నాయకుడిగా శ్రీకృష్ణుడు కీర్తించబడ్డారు. ఈ నాయికలను వివిధ కళారూపాలలో కూడా చూపించబడ్డారు. భారతీయ చిత్రకళ, సాహిత్యం, శిల్పం, నృత్యం, సంగీతం మొదలైన కళారూపాలలో ఈ అష్టవిధ నాయికలను సృజించారు. అందంగా ఆవిష్మృతి చేసారు. అంతేకాదు హిమాచల్‌ప్రదేశ్‌లోని చంబాలోయ ప్రాంతంలో చంబా రుమాల్‌ని అలంకరించడానికి పహరీ ఎంబ్రాయిడరీలో అష్టవిధ నాయికలను ముఖ్యాంశంగా తీసుకుంటారు. వీరిని ఎనిమిది రూపాలుగా ప్రదర్శిస్తారు. రాగమాల చిత్రాలలో కూడా చిత్రించారు.

- జ్యోతి వలబోజు

గమనిక: " అష్టవిధ నాయికలు " ఈబుక్ సైజు 6.9 mb

Preview download free pdf of this Telugu book is available at Ashtavidha Nayikalu