• Ashtadasa Saktipitalu
  • Ebook Hide Help
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అష్టాదశ శక్తిపీఠాలు

    Ashtadasa Saktipitalu

    Pages: 88
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ చరాచర సృష్టి అంతా మాతృ స్వరూపమే. జగన్మాత అయిన ఆదిపరాశక్తి సృష్టి స్థితిలయాలకు కారణభూతురాలిగా, త్రిగుణ స్వరూపిణిగా, త్రిలోక పూజ్యగా యుగయుగాలుగా ఎందరో దేవ దానవ మానవాది గణాలచేత కీర్తించబడుతోంది. ప్రపంచంలోని అన్ని దేశాలకన్నా మన భారతదేశం ఎంతో పుణ్యప్రదమైనది. అందుకే ముక్కోటి దేవతలు ఈ పవిత్రదేశంలో ఎన్నో రూపాలతో స్వయంభూలుగా నిలచి భక్తులందరినీ తరింపచేస్తున్నారు.

ఆసేతుశీతాచల పర్యంతం శక్తి దేవాలయాలు మనకి అసంఖ్యాకంగా దర్శనమిస్తాయి. ఉత్తర భారతంలో దుర్గారాధన, ఈశాన్య ప్రాంతంలో కాళీ, తారా ఆరాధనలు, దక్షిణ భారతదేశంలో శ్రీ లలితాదేవి ఆరాధనలు బహుళ ప్రాచుర్యంలో వున్నాయి. ఇక దివ్యక్షేత్రాల విషయానికి వస్తే దేశవ్యాప్తంగా ఎన్నో పేర్లతో, ఎన్నో రూపాల శక్తి ఆలయాలు విశేషంగా ఉన్నాయి. అయితే వీటన్నిటిలోనీ విశ్వవిఖ్యాతమైనవి అష్టాదశ శక్తిపీఠాలు.

పురాణాలను అనుసరించి 108 దివ్యశక్తి పీఠాలు, 52 శక్తిపీఠాలు ప్రాచుర్యంలో ఉన్నప్పటికి అష్టాదశ శక్తిపీఠాలు వీటన్నిటి కన్నా దివ్యశక్తి సంపన్నమైనవిగా, మహిమాన్వితమైనవిగా ఖ్యాతి పొందాయి. దేవీ భక్తులందరికీ ఈ శక్తిపీఠాల చరిత్రని సంగ్రహంగా తెలియచేయాలని ఆశయంతో ఈ గ్రంథాన్ని రూపొందించాము. దీనిలో అష్టాదశ శక్తిపీఠాల చరిత్ర, వాటి ప్రయాణ మార్గాలు వంటి వివరాలతో పాటు 52శక్తిపీఠాల విశేషాల్ని, అలాగే 108 అష్టోత్తర శత శక్తిపీఠాల దివ్యస్తోత్రాన్ని కూడా అందిస్తున్నాం. దేవీ భక్తులందరినీ ఈ గ్రంథం అలరిస్తుందని ఆశిస్తూ...

- ప్రకాశకులు

Preview download free pdf of this Telugu book is available at Ashtadasa Saktipitalu