-
-
అసంపూర్ణ
Asampoorna
Author: Raamaa Chandramouli
Publisher: Srujana Lokam
Pages: 118Language: Telugu
Description
చాలా దూరమే జరిగింది ప్రయాణం
కదలికలన్నీ వ్యూహాలన్నీ అవగతమౌతున్నపుడు
నీ నా చలనాలన్నీ
ఒట్టి అనిర్ధారిత సమీకరణాలే
జవాబు రాదు... నడక ఆగదు
సరైన జవాబు రావాలంటే
సంధించబడుతున్న ప్రశ్న సరిగా ఉండాలి...
* * *
స్ట్రెచ్... సాగదీసుకోవాలి.. శరీరాన్ని... మనసును... హృదయాన్ని దిగంతాలదాకా
విస్తరిస్తున్నప్పుడు మనిషి ద్రవిస్తూండడం
అశ్రువులతో అభిషిక్త ఐనపుడు మనిషి శుద్ధి ఔతుండడం తెలుసుకుందామె
అప్పుడామె
మాటకంటే మౌనం గొప్పదనీ... మౌనంకంటే నిశ్శబ్దం ఇంకా గొప్పదనీ
శబ్దం అశబ్దంగా మారుతున్న వేళ
విస్ఫోటించే జ్ఞానకాంతుల గురించి తెలుసుకుంది...
Preview download free pdf of this Telugu book is available at Asampoorna
Login to add a comment
Subscribe to latest comments
