• Asamanatvamlo Ninchi Asamanatvamloke
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 81
    90
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అసమానత్వంలో నించి అసమానత్వంలోకే!

    Asamanatvamlo Ninchi Asamanatvamloke

    Author:

    Pages: 312
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ సంపుటంలో - అ‹సమానత్వం…లో నించి అస‹మానత్వం…లోకే!, తుల‹సి దళం కాదు, గంజాయి దమ్ము!, 'యుజ్ఞం' క›ధ మీద 2 వ్యాసాలు, ఈ చక్కని పాడియావు ఎవరిది? - అనే 4 సాం„ఘిక, సాహిత్య విమర్శనాత్మక పుస్తకాలు ఉన్నాయి.

* * *

చర్చ, వాదం, తర్కం, విమర్శ, పరిశీలన - ఇవన్నీ దాదాపుగా ఒకటే. అన్నీ హేతువాదాన్ని ఆధారం చేసుకుంటూ సాగవలసినవే. అందరూ, హేతువు (కారణం) మీదే సాగితే, ఏ చర్చ అయినా చాలా తొందరగా ముగుస్తుంది. అప్పుడు అందరికీ ఒకే అభిప్రాయం స్తిరపడుతుంది.

ఏ సమస్యకైనా ఏదో ఒక కారణం ఉంటుంది. ఏ సమస్య అయినా, ఒక లెక్క లాంటిదే. లెక్కని ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు చెయ్యలేరు. ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు చేసి లెక్కకి అందరూ సరైన జవాబు సాధించలేరు. 5+3=ఎంత? - ఈ లెక్కని ఎంత మంది చేసినా, సరైన జవాబు 8గా వుండవలసిందే. తప్పు జవాబులు అయితే అనంతం. 8 గాక, మిగిలినవి అన్నీ. 5+3 కి జవాబుని, 9 గానో, 11 గానో చెప్పి ఎవరైనా ఒప్పించగలరా? అది అసాధ్యం. సమస్యల సంగతి కూడ అంతే. తప్పు జవాబులతో సమస్యల్ని ఎవరూ పరిష్కరించలేరు.కానీ, లెక్కల విషయంలో అయితే, అందరూ సరైన జవాబుల కోసమే ప్రయత్నిస్తారు. అక్కడ, ఎవరి ఇష్టాలు వారికి వుండవు. ఎవరి స్వంత వాదాలు వారికి వుండవు.

కానీ సమస్యల సంగతి అలా కాదు. సమస్య ఎంత చిన్నది అయినా, అసలు, 'సమస్య' తలెత్తిందీ అంటే, అందులో వేరు వేరు పక్షాలు వుంటాయి. సమస్యని అవి చూసే విధానాలూ, వాటి పరిష్కారాలూ, పరస్పర వ్యతిరేకంగా గానీ, కనీసం భిన్న భిన్నంగా గానీ, వుంటాయి.

నిజానికి, ఒక 'చర్చ'లో వున్న వాళ్ళు, తమకు అప్పటికే వున్న భావాల్నీ, తమ విశ్వాసాల్నీ, తమ లాభాల్నీ, తమ ఇష్టాయిష్టాల్నీ, అలాంటి వన్నీ తీసి పక్కన పెట్టాలి. కానీ, మనుషుల్లో మెజారిటీకి, ఆ దృష్టి ఇంకా అలవడలేదు. ఇంకా అలవాటవలేదు.

ఈ సంపుటంలో వున్న 4 పుస్తకాల మీద చర్చల్లోనూ అనేక మంది పాటించిందంతా తర్క రాహిత్యమే.

Preview download free pdf of this Telugu book is available at Asamanatvamlo Ninchi Asamanatvamloke