-
-
అసలైన విప్లవవాదీ... సిసలైన సిద్ధాంతకర్త - గాంధీజీ (3వ ముద్రణ)
Asalaina Viplavavadi Sisalaina Siddhanta Karta Gandhiji Third Edition
Author: Nagasuri Venu Gopal
Publisher: Gandhi Bhavan
Pages: 160Language: Telugu
మహాత్ముడిని దర్శిద్దాం
అసలైన విప్లవవాది, సిసలైన సిద్ధాంతకర్త గాంధీజీ పేరుతో డా.నాగసూరి వేణుగోపాల్ రచించిన ఈ పుస్తకం బాపూజీ కొండంత వ్యక్తిత్వాన్ని అద్దంలో చూపింది. గాంధీజీ గురించి తెలియని ఎన్నో విషయాలను సాధికారంగా ఉదాహరణలతో చూపారు రచయిత. నేడు గాంధీజీ ప్రాసంగికత కోల్పోయారని జరుగుతున్న దుష్ప్రచారాలకు ఈ పుస్తకం సిసలైన వెలుగుచుక్క. శాస్త్ర సాంకేతిక విజ్ఞానానికి ఆయన వ్యతిరేకి అనీ, కేవలం మతాన్ని పట్టుకు వేలాడే మనిషి అనీ, స్వాతంత్ర సముపార్జన వరకే చరఖా అవసరపడిందని - మిడిమిడి జ్ఞానంతో విమర్శించే వారికి ఇది కనువిప్పు. గాంధీజీ నూరేండ్ల క్రితమే ఎంత క్రాంతదర్శిగా ఉండేవాడో, ఎంత దూరదృష్టితో ఆలోచించేవాడో ఈ పుస్తకం చెబుతుంది. అన్ని రంగాల పైనా సాధికారత, అభినివేశం ఆయనకు ఎంతగా ఉండేదో తేట పరుస్తుంది. అలాగే కస్తూర్బా గురించి తెలియని ఎన్నో విషయాలు మనం ఈ పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. బ్రహ్మచర్య వ్రతం – గాంధీ ప్రయోగాలు, దేశీ, విదేశీ వైద్యశాస్త్రాలకి సంబంధించిన అభిప్రాయాలు ఇందులో కూలంకషంగా చర్చించారు. పైకి ఆయనకు వ్యతిరేకంగా కనిపించినా లోహియా, ఐన్ స్టీన్ లాంటి వాళ్ళు బాపూపట్ల ఎంత గౌరవంగా ఉండేవారో రచయిత చెప్పారు. పి.సి.రే, జగదీశ్ చంద్రబోస్, సి.వి.రామన్ తదితర శాస్త్రవేత్తలు గాంధీజీ సైన్సు పరిజ్ఞానంపై ఏమన్నారో కూడా ఈ పుస్తకం తెలియచేస్తుంది. అన్నిటికన్నా ముఖ్యం ఈ తరానికి గాంధీజీ భావజాలం ఎంత అవసరమో ఇది చదివితే బోధపడుతుంది.
- చంద్రప్రతాప్
(నమస్తే తెలంగాణ)

- ₹135.6
- ₹216
- ₹270
- ₹60
- ₹162
- ₹216