• Arthi Kavitvam - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • ఆర్తి - కవిత్వం (free)

    Arthi Kavitvam - free

    Author:

    Pages: 128
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అరుణ స్వరంలో, మనసులో, చేతనలో ఆర్తి పలుకుతుంది, వెలుగుతుంది, ప్రదీప్తమవుతుంది. ఆ ఆర్తి ఆమె మాటల్లో కార్యాచరణలో నేనింతకుముందు గమనించాను. ఇప్పుడు ఆమె కవితా సంపుటిలో చదివి సంతృప్తనయ్యాను. మనసు సూటిగా మాటలలోకి, పదాలలోకి వచ్చి ఒక కవితగా తనను తాను కూర్చుకుంటే, అక్కడ ఆ కవితతో పాటు కవయిత్రి కూడా మనకు దగ్గరగా వస్తుంది. సన్నిహితమవుతుంది. ఎప్పటికంటే ఎక్కువ ఆత్మీయురాలవుతుంది. అరుణ ఈ కవితా సంపుటి ద్వారా బాగా దగ్గరి మనిషయింది. తన ఉపన్యాసాలలో ఆమె భావాలు కొన్నిసార్లు విన్నాను. అక్కడక్కడా ఆమె కవితలూ కొన్ని ముందే చదివాను. కానీ 'ఆర్తి' సంపుటి చదివాక అరుణ మరింత బాగా అర్థమయింది.

ఈ సమాజం స్త్రీల పట్ల, బలహీనుల పట్ల, శ్రామికుల పట్ల, అల్పసంఖ్యాకుల పట్ల చాలా అన్యాయంగా, నిర్దయగా, అణచివేత తత్త్వంతో ఉంది. ఆ అణచివేతను గట్టిగా ఖండించాలి. అన్యాయాన్ని ఎక్కడికక్కడ నిలదీయాలి అనే ఆవేశంతో రాసిన కవితలు ఈ “ఆర్తి” కవితా సంపుటి నిండా ఉన్నాయి. ఆవేశం, అగ్రహం, కఠినంగా ప్రశ్నించటం మాత్రమే కాదు అరుణ చాలా సున్నితంగా స్పందించగల మనసున్న మనిషని కూడా ఈ కవితలు చదివితే మనకు అర్థమవుతుంది. సున్నితమైన స్పందనలున్నపుడే కదా ఆర్తులపట్ల కరుణ కలిగి, వారినాస్థితిలో ఉంచిన సామాజిక, రాజకీయ పరిస్థితులపై ఆగ్రహావేశాలు కలిగి వాటిపై నడుం బిగించేది! సమరశంఖం పూరించేది! ఆ స్పందనలు అరుణకు సహజ స్వభావికమని “ఆర్తి"లోని పలు కవితలు మనకు చెబుతాయి. కవిత్వం ఎందుకు రాయాలో ఎవరి పక్షం వహించాలో, ఎవరి వేదనలను అక్షరీకరించి పాఠకులను సమస్యల పట్ల సున్నిత మనస్కులుగా చేయాలో అరుణ తన జీవితానుభవాల నుండి తనకు ఎదురైన సంఘటనల నుండి గ్రహించింది. సామాజిక దురన్యాయాల పట్లా, సమాజంలో పేరుకుపోయిన అమానుషత్వం పట్లా పాఠకుల కళ్ళు తెరిపించి, వారు వీటికి అంధులై, బండబారిపోకుండా వారినీ సున్నిత మనస్కులుగా చేయటం తన కవితా కర్తవ్యంగా, బాధ్యతగా అరుణ స్వీకరించినట్లు ఈ సంపుటి ఆసాంతం శ్రద్ధగా చదివినపుడు మనకు అర్థమవుతుంది.

- శ్రీమతి ఓల్గా