-
-
అర్థ గౌరవం
Arthagowravam
Author: Deevi Subbarao
Pages: 81Language: Telugu
ఇవి దీవి సుబ్బారావు వ్రాసిన ఐదు నాటికలు. యోగవాసిష్ఠంలోని ఇంద్రజాలోపాఖ్యానం; భారతం ఆదిపర్వం ప్రథమాశ్వాసంలోని భృగువంశ కీర్తనం; పదవ శతాబ్దంలో వున్న విశిష్టాద్వైత సంప్రదాయప్రవర్తకుడు యామునాచార్యుల జీవిత చరిత్ర; మహా కవులైన కాళిదాసు, భారవిలను గురించి ప్రచారంలో వున్న కథల ఆధారంగా తీసుకుని రచించిన నాటికలు ఇవి.
* * *
నాటకాన్ని అది వేసే చోటుకి వెళ్ళి రంగస్థలం మీద పదిమంది మధ్య కూర్చుని చూడవచ్చు. ఇంట్లో పుస్తకం పట్టుకొని ఒక్కడే వుండి చదువుకోవచ్చు. దేని ఆనందం దానిది. నాటకం వెయ్యటానికి బోలెడు సరంజామా సమకూర్చుకోవాలి. పుస్తకంగా అచ్చుకావటానికి నానాశ్రమా పడాలి. దేని కష్టం దానిది. నాటకం ఆడుతున్నప్పుడు చూసే వాళ్లలో కలిగే రసానుభూతి పదిమందితో కలిసి అనుభవించేది. దాని గుణం సమాజికం. అదే నాటకాన్ని పుస్తకరూపంలో చదువుకొంటున్నప్పుడు కలిగే రసానుభూతి ఒక్కడే వుండి అనుభవించేది. దీని గుణం వ్యక్తినిష్ఠం. పదిమందిలో వున్నా రసం పాకాన పడ్డప్పుడు చుట్టూతా వున్న పదిమందిని మరిచిపోవచ్చు. ఒక్కడేవుండి చదువుకొంటున్నా రంగస్థలం కళ్ళముందు కట్టినట్టు వూహించుకోవచ్చు.
ఇంతగా చెప్పటం దేనికంటే నాటకం రంగస్థలం మీద వెయ్యటానికీ అనువుగా వుండాలి, చదువుకోవటానికీ పనికిరావాలి. షేక్స్ పియర్, కాళిదాసు, గురజాడ అప్పారావు నాటకాలు అన్నీ మనం చూడగలుగుతున్నామా? చదువుకొని ఆనందించటం లేదూ?
This book is now available in Tenglish script with kinige. For details, click the link.