-
-
అరణ్య ఘోష - మైథిలీ వెంకటేశ్వర రావు
Aranya Ghosha Maithili Venkateswara Rao
Author: Mydhili Venkateswara Rao
Pages: 200Language: Telugu
కోటానుకోట్ల నిధి....
వజ్ర వైఢూర్య మణి మకుట గోమేధిక పుష్యరాగాలు గల బంగారు పేటిక..... దాని కోసం ... ముగ్గురు ఇంటర్నేషనల్ క్రిమినల్స్....
వారికా నిధి అందకూడదని అనుక్షణం వారితో పోరాడే ఓ నవయువ సాహస జంట.
వారందరికీ తెలియకుండా వెంటాడే ఓ బడా పెద్ద మనిషి... అతనికి తోడు ఓ చోటా గూండా.
అంతా ఒకే చోటికి చేరుకున్నారు. అదీ కీకారణ్యంలో.... సరిగ్గా అప్పుడు మొదలైంది......
అరణ్య ఘోష
ఇది మైథిలీ వెంకటేశ్వరరావు రచన
* * *
ఆ ఫోటో వంక చూసి ముగ్గురూ షాక్ తిన్నారు.
ఆ ఫోటో శుభాంగిది....
భారతీయ ప్రాచీన భాషల మీద విదేశాల్లో ఉపన్యాసాలిచ్చి ఇండియా తిరిగొచ్చిన శుభాంగిది.
''ఈమె మనకెందుకు రాసింది. కొంపదీసి చక్రనేమి వంశస్థురాలు కాదుగదా ఈ శుభాంగి. మన ప్రకటన చదివి రాసి వుంటుందంటావా? ఆమె కూడా మనలాగే మిగతా రెండు తాళపత్రాల కోసం ప్రయత్నిస్తుందంటావా?''
''ఊహలెందుకు? చేతిలోని లెటర్ చదువు'' చెప్పింది రోజి.
అంబాదాస్ లెటర్ మడతలు విప్పాడు. పూర్తిగా చదివి దీర్ఘంగా నిట్టూర్చి-
''ఈ లెటర్ రాసింది శుభాంగి తల్లి తులశమ్మ...'' చెప్పాడు.
రాబర్ట్, రోజి అయోమయంగా చూశారు.
''మరో కొత్త క్యారెక్టర్'' రాబర్ట్ భుజాలెగరేశాడు.
''చూడబోతే నిధికి వాటాలు ఎక్కువయ్యేలా వున్నాయి''
రోజి, రాబర్ట్ల గురించి పట్టించుకోవటం లేదు అంబాదాస్.
రాజేష్... రాజేష్... శుభాంగిని ప్రేమించి పెళ్ళి చేసుకోబోతున్నవాడు రాజేష్.
''ముందు మీరిద్దరూ ఈ లెటర్ని చదవండి'' చెప్పాడు అంబాదాస్.
ఇద్దరూ కూడబలుక్కుని చదివారు.
''మొత్తానికి సమ్థింగ్ ఈజ్ రాంగ్...ఏదో జరగబోతోంది. మనకి తెలియకుండా గోతులు తవ్వుతున్నారు. ఉచ్చులు బిగిస్తున్నారు''
''అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకు అంబాదాస్. ఒకే దెబ్బకి రెండు పిట్టలు. మన తాళపత్రం చదివేది, మనకి కావలసిన చక్రనేమి వంశస్థురాలు ఇద్దరూ ఒకటే కావటం మన లక్. ఏకంగా వలలో కావలసిన చేపలే పడ్డాయి.''

- ₹233.28
- ₹280.8
- ₹125.28
- ₹233.28
- ₹125.28
- ₹233.28