-
-
అపాయం - ఉపాయం
Apayam Upayam
Author: Dr. Vasa Prabhavati
Publisher: Self Published on Kinige
Pages: 70Language: Telugu
చదువు అనేది బుర్రలో చేరే ఒక వస్తువు కాదు. ఒక ఫీలింగ్. అనుభూతి అనుభవం! మానసిక వికాసాన్ని పెంచడానికి తోడ్పడుతుందనుకున్నప్పుడు అందుకు కేవలం పాఠ్యపుస్తకాలేకాక మరెన్నో పుస్తకాలు సహకరిస్తాయనే సత్యాన్ని మరువకూడదు. పిల్లలకి చిన్నప్పటి నుంచి కథ, కవిత, గేయం, నవల లాంటి ప్రక్రియల ద్వారా భాషపట్ల అభిరుచిని పెంచుతూ-క్రమంగా వాళ్ళకి అటువంటి సాహిత్యాన్ని చదివే అలవాటు చెయ్యాలి. 'మంచి పుస్తకమే మంచి మిత్రుడు' అనే విషయాన్ని పిల్లలకి చెప్పి వాళ్ళలో పఠనాసక్తిని పెంపొందించాలి. మంచి పుస్తకాలను సమయం దొరికినప్పుడల్లా తిరగవేసే అలవాటు కలిగినప్పుడు ఎన్నెన్నో విషయాల్ని తెలుసుకోవడంతోపాటు, ఖాళీ సమయాన్ని వృథా చెయ్యకుండా పఠనానికే వినియోగిస్తారు.
ప్రముఖ రచయిత్రి డా|| వాసా ప్రభావతిగారు పిల్లల కథల సంపుటి 'అపాయం-ఉపాయం'తో బాటు 'పిల్లలు-పిడుగులూ!' అనే పిల్లల నవల, 'జాబిల్లి రావే' అనే పిల్లల గేయ సంపుటి ద్వారా పిల్లల గేయ సంపుటిని ఇలాంటి పరిస్థితుల్లో తీసుకురావడం ఆనందాన్ని కలిగిస్తోంది. ఆవిడని ఆదర్శంగా తీసుకుంటున్న రచయిత్రులూ బాలసాహిత్య సేవని చేపడతారని ఆశిస్తున్నాను.
- వేదగిరి రాంబాబు
