-
-
ఆపస్తంబ కల్పసూత్రమ్ 1
Apastamba Kalpasutram 1
Author: Dr. N. L. Narasimhacharya
Publisher: Gayathri Prachuranalu
Pages: 390Language: Telugu
ఆపస్తంబ కల్పసూత్రమ్ వేదాంగాలలో ఒకటి. ఆయా వేదాలకు అనుగుణంగా ఆయా మహర్షులు కల్పసూత్రగ్రంథాలను రచించినారు. ఈ ఆపస్తంబ కల్పసూత్రం కృష్ణయజుర్వేదానికి సంబంధించినది. తెలుగునాట ఉన్న బ్రాహ్మణులంతా ఆపస్తంబ సూత్రీయులే అంటే అతిశయోక్తి కాదు.
ఇది సుమారు ఇరువదియైదు వేల సంవత్సరాల ప్రాచీనమైనది. తెలుగువాడు నోచుకున్న అదృష్టంవల్ల కాబోలు మిగిలిన సూత్రాలకంటే ఆపస్తంబ కల్పసూత్రం నేటికీ సమగ్రంగా లభిస్తున్నది. దీనిలో 1. శ్రౌతసూత్రం, 2. పరిభాషాసూత్రం, 3. ఏకాగ్నికాండ అనే మంత్రసూత్రం, 4. గృహ్యసూత్రం, 5. ధర్మసూత్రం, 6. శుల్బసూత్రమనే ఆరు విభాగాలున్నాయి. శ్రౌత, పరిభాషాసూత్రాలలో యజ్ఞ, యాగాలకు సంబంధించిన విషయాలే కాక, గృహ్యసంబంధమైన విషయాలు, ధర్మ సంబంధమైన విషయాలు కొన్ని కన్పిస్తాయి. గృహ్యసూత్రం - వివాహం చేసికొన్నవాడు తన సంతానం గురించి చేయాల్సిన పుంసవనం, జాతకర్మ, నామకరణం మొదలైన కర్మలనాచరించే పద్ధతిని తెలుపుతుంది. ధర్మసూత్రం మానవులాచరించాల్సిన ధర్మాలను
తెలుపుతూ, కొన్ని చోట్ల స్త్రీలు చెప్పినట్లే వినవలసియుంటుందని చెప్తుంది. ఇక శుల్బసూత్రం హోమకుండాలకు సంబంధించిన గణిత విషయాలను తెలుపుతుంది.
ఈ గ్రంథం సమగ్రంగా లభించినా, తెలుగువారి దురదృష్టమేమో కాని, తెలుగువాడైన ఆపస్తంబ మహర్షి రచించిన ఈ గ్రంథం తెలుగు లిపిలో నేటికీ సమగ్రంగా లభించడం లేదు.
ప్రస్తుతం ఆ గ్రంథాన్ని సమగ్రంగా మూల మాత్రంగానైనా రెండు భాగాలలో అందిస్తున్నాం. ఇది మొదటి భాగం. చాలా ప్రాచీనమైన ఈ గ్రంథాన్ని వేదగ్రంథాన్ని ఆదరించినట్లైనా తప్పక ఆదరిస్తారని ఆశిస్తున్నాం.
- సంపాదకుడు

- ₹162
- ₹540
- ₹360
- ₹270
- ₹360
- ₹162
- ₹162
- ₹540
- ₹360
- ₹270
- ₹360
- ₹162