-
-
అపరోక్షానుభూతి - శంకర భగవద్పాద కృతం
Aparokshanubhuti Shankara Bhagavadpada Krutam
Author: Vellanki Seshadri Sarma
Publisher: Victory Publishers
Pages: 94Language: Telugu
మోక్షాన్ని కోరేవారు ముందు అనుసరించవలసినది సాధన చతుష్టయం. అవి 1. నిత్యానిత్య వస్తు వివేక జ్ఞానము 2. శమదమాది షట్క సంపత్తి 3. ఇహముష్మిక ఫల భోగ విరాగం 4. వైరాగ్యము. మొదటి మూడింటిని అనుభవంలోనికి తెచ్చుకుంటే నాల్గవదైన వైరాగ్యము కలుగుతుంది.
వైరాగ్యం స్థిరంగా ఉండాలంటే ఆత్మ యొక్క ప్రత్యక్షానుభవం కావాలి. ప్రత్యక్షానుభవం కలగడానికి ఆత్మ వస్తువు కాదు. గురువు వలన తెలుసుకొన వచ్చును గదా అంటే అది పరోక్షానుభుతి అవుతుందిగాని స్వానుభవం కాదు. అట్లని గురువు అవసరం లేదా అంటే అదీ కుదరదు. తమస్సు నుండి జ్యోతిస్సు లోనికి తీసుకొని వెళ్ళేవాడే గురువు. అట్టి గురువులకు గురువైన జగద్గురువు శ్రీ ఆదిశంకరుల వారు చెప్పిన అపరోక్షానుభూతిని పొందాలి. పరోక్షానుభూతి అంటే పంచదార తియ్యగా ఉంది అని ఎవరో చెఫ్పితే నమ్మినట్లు. ఆ పంచదారను మనమే తింటే తియ్యదనం మన అనుభవంలో ఉంటుంది. కాబట్టి గురువు చెప్పిన, చూపిన మార్గంలో స్వయంగా విచారణ చేసి పొందిన స్వానుభవమే అపరోక్షానుభూతి. అది పొందాలి. దానిని స్థిరంగా ఉంచటమే మోక్షం. అలాంటి మోక్షాసక్తిని కలిగించడమే ఈ చిన్న ప్రయత్నం అనుభవసార వివరణ.
- వెల్లంకి శేషాద్రి శర్మ
