-
-
అపరిమితమైన జీవితం (రామ్తా)
Aparimithamina Jeevitham Ramtha
Author: V V Ramana
Publisher: Akshara Publications
Pages: 128Language: Telugu
ఒక వృక్షాన్ని కౌగిలించుకుని మీరు ప్రేమను ఎప్పుడైనా పంచారా? ఒక కొండపైకి ఎక్కి అక్కడ మేఘములను, ఆ చల్లటి గాలిని, కొండపై గల ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఎప్పుడైనా ఆస్వాదించారా? హిమాలయ పర్వతాలలో (లేదా ఇతర మంచు పర్వతాలలో) సంచరించి అక్కడ గుహలలో ఎప్పుడైనా ధ్యానం చేశారా? ఈ చెట్టునుండి ఆ చెట్టుకు... అలా చెట్లపై సంచరించే అపురూపమైన అందమైన సీతాకోకచిలుకను ఎప్పుడైనా గమనించారా?
సాయం సంధ్యాసమయంలోనూ + ప్రాతఃకాల సూర్యోదయంలోనూ ఆకాశంలో అగుపించే అందాలను ఎప్పుడైనా తిలకించారా? పసిపాప బోసి నవ్వులను ఆస్వాదించారా?
వీటన్నింటినీ చూస్తే మీకేమనిపిస్తుంది! జీవితం ఎంత అద్భుతమైనదో, ఎంత మహత్త్వం గలదో మీకు విశదం అవుతుంది గదా! అందుకే మిమ్ములను మీరు ప్రేమించాలి! మీ జీవితాన్ని ప్రేమించాలి, మీ జీవిత మాధురాన్ని ఆస్వాదించాలి; జీవితంలో ప్రతి క్షణాన్ని ఈ వర్తమానంలోనే ఆస్వాదించడం మీరు చేయాలి.
జీవితం మధురం! జీవితంలో ప్రతి క్షణమూ మధురం! పుట్టుక మధురం, మరణం మధురం! ప్రతి జీవితానుభవమూ ఒక మధురం! ప్రతి సవాలూ మధురం! మీలోని దైవం (బ్రహ్మపదార్థం) మధురం! మరి మహిమానిత్వం! ఈ విశ్వం మధురం!
