• Anuyogam Bhakti Trayee
  • fb
  • Share on Google+
  • Pin it!
 • అనుయోగం, భక్తి, త్రయి

  Anuyogam Bhakti Trayee

  Pages: 136
  Language: Telugu
  Rating
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  Be the first to vote
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

కవిశిరోమణి ఆచార్య రావికంటి వసునందన్ రచించిన "అనుయోగం", "భక్తి", "త్రయి" అనే మూడు కావ్యాల సంపుటం ఈ ఈ-బుక్.

* * *

అనుయోగం అంటే అడగటం. ఎవరిని ఎవరడుగుతున్నారు? కవి తనను తానే అడుగుతున్నాడు. కవి సమాజాన్ని అడుగుతున్నాడు. కవి ఎదుటివ్యక్తిని అడుగుతున్నాడు అనే విధంగా సమాధానాలు చెప్పవచ్చును. కాని ఇప్పుడు ఇక్కడ మాత్రం కవి అంతర్ముఖుడై తనను తానే అడుగుతున్నాడు. ఈ అడగడాన్నే సంస్కృతంలో 'ప్రశ్న' అంటారు. పృచ్ఛించడమే ప్రశ్న. మనకు ఉపనిషత్తుల్లో ప్రశ్నోపనిషత్తు ఉంది. ఈ కావ్యం గూడా ఒకరకంగా తెలుగులో ఉపనిషత్తులాంటిదే. ఉపనిషత్తులు ఋషి ప్రోక్తాలు. కవిగూడ ఋషి కదా! (నానృషిః కురుతే కావ్యం). దీనిలో అరవై ప్రశ్న లెందుకున్నాయంటే కవి తన అరవైయేండ్ల జీవిత సారాన్ని రంగరించి ఈ ఆంధ్రప్రశ్నోపనిషత్తును రచించారు. అరవై ప్రశ్నలు అరవై ఏళ్ళ జీవితానికి ప్రతీక. 'త్రిపదులు' అంటే మూడు పాదాల్లోనే ఎందుకు వ్రాశారు? సృష్టి త్రిగుణాత్మకమైనది. సత్వరజస్తమోగుణాలతో సృష్టి జరుగుతున్నది. ఆ సృష్టి తత్వాన్ని తన అనుయోగంద్వారా వివరించడానికి 'త్రిపదు' లను సంకేతంగా ఉద్దేశించారు. ఈ త్రిపదుల్లో ఏముంది?... మొదటిది ప్రశ్న. రెండవది ఉపమానం. మూడవది ప్రశ్నకు సమాధానంగా, వస్తుస్వభావం తెలిపేదిగా, తత్త్వప్రతిపాదకంగా ఉంటుంది. 'అనుయోగం' కావ్యం - ఆధునిక (తెలుగు) ప్రశ్నోపనిషత్తుగా, తాత్త్వికంగా జీవుని వేదనను తెలపడానికి రచించిన నూత్నప్రయోగంగా, 'త్రిపదు'ల సంయోజనవల్ల ఆహ్వానించదగిందిగా కనబడుతూ సహృదయులను అలరించబోతూందనడంలో సందేహం లేదు.

- డా. బి. జయరాములు

* * *

ఈ కావ్యం ఒక భక్తి రసకుల్య. మాతృభక్తి, పితృభక్తి, గురుభక్తి, పతిభక్తి, దేశభక్తి రంగరించుకున్న వచన కవితాకృతి ఈ కృతి. భక్తి వట్టి దాస్య శృంఖలం కాదు. భక్తి ఒక శక్తి. అంగీకరించగలిగితే ఒక దివ్య శక్తి. విశ్వాంతరాళంలో ఈ దివ్యశక్తి అనేక ముఖాలుగా, అనేక రూపాలుగా అవతరిస్తుంది. ఎక్కడ శక్తి ఉందో అక్కడ భక్తి ఉంది. ఎక్కడ భక్తి ఉందో అక్కడ శక్తి అవతరిస్తుంది. శక్తి ఎక్కడ ఏ విధంగా రూపుదాల్చుతుందో అక్కడ విభూతులు వెలుగొందుతాయి. అదే విశ్వరూప సందర్శనం. ఈ కృతిలో వేదాంతుల ప్రసక్తి ఉంది. పురాణ పురుషుల ప్రస్తావన ఉంది. చారిత్రక పురుషుల ప్రసక్తి ఉంది. ఆధునిక సమాజాన్ని తీర్చిదిద్దిన నేతల ప్రస్తావన ఉంది. ఎవరెవరి లక్షణాలు ఎలాంటివో వివరించిన వైనం ఉంది. ఇది విశ్వావలోకం, విశ్వంభరావలోకనం. విశ్వరూపావలోకనం. డా. వసునందన్‌గారు ఈ కృతి ద్వారా ప్రకృతిలోని వైరుధ్యాలను, వైమనస్యాలను, ప్రేమను, ద్వేషాన్ని ఎంత వరకు సమరసపరచుకోవచ్చునో వర్ణించిన తీరు అభినందనీయం. ఈ కృతి ద్వారా వారి హృదయంలోని భక్తికి ఆకృతి ఇవ్వడం హర్షదాయకం.

- ఆచార్య ఎల్లూరి శివారెడ్డి

* * *

ఈనాటికి ఎన్నో రంగాల్లో ఎంతో ఎత్తుకు ఎదిగిపోయాడు మనిషి, ఇంకా ఎంతో ఎదుగుతాడు. ఈ పెంపులోనే అడుగడుగునా మనిషిని అడుసులో తొక్కజూసే అంతశ్శత్రువు అధి - అంటే అరిషట్కరూపమై భౌతిక సుఖాల కోసం మనస్సుని వేధించే వ్యాధి అనాదిగా మనిషిని పీడిస్తునే ఉంది. ఎంత ఎదిగినా అంతశ్శోధన లేక ఆధిని అణచలేక వట్టి బయలు పాకే ఆర్భాటం పరమ నికృష్టం నా దృష్టిలో. తన మనసెంతో ఎదుటి మనస్సూ అంతేనన్న గుణం అనుక్షణం కన్నుల్లో కదిలినప్పుడే తల్లిపాలు జీర్ణమైనట్లు. అదే అంతర్దృష్టి, అదే మానవత్వం. అదే లేనప్పుడు తక్కిన ముసుగులన్నీ ఎందుకు? ఉన్న రూపం దాచి ఊరేగడానికా? కన్నులున్న ధృతరాష్ట్రులను వెన్నుతట్టి లేపడానికే ఈ చిన్నపాటి కవితా సుప్రభాతం.

- వసునందన్

Preview download free pdf of this Telugu book is available at Anuyogam Bhakti Trayee