• Anubhavala Neccheli
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 75
    149
    49.66% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అనుభవాల నెచ్చెలి

    Anubhavala Neccheli

    Author:

    Pages: 243
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రతి మనిషి జీవితంలో రకరకాల అనుభవాలు ఉంటాయి. ఆ అనుభవాలే ఆ మనిషికి నేర్చుకున్నన్ని జీవితపాఠాలనూ నేర్పిస్తాయి. ఎవ్వరికైనా నిరాకారము నిర్గుణము ఐన ఆ అనుభవాలతో జత కట్టక తప్పదు.
యాదృఛ్ఛికంగా వచ్చిన అనుభవాలే కాక కొన్ని కోరికలను తీర్చుకునే నేపథ్యంలోనో లేదా కొన్ని గమ్యాలను చేరుకునే నేపథ్యంలో కూడా ఎన్నో అనుభవాలు ఎదురవుతుంటాయి.
అలాంటి అనుభవాలకి ఒక నెచ్చెలి రూపాన్ని ఇస్తే ఎలా ఉంటుంది? నిజమే, అనుభవాలు నిరాకారాలూ, నిర్గుణాలే. కానీ అవి మనలో ఎన్నో వికారాలకు కారణమవుతాయి. కానీ అవే అనుభవాలను నిర్మలమైన మనసుతో చూస్తే ఏ దిశా లేని మనకు తోడుగా ఉండి మన జీవితానికి దిశా నిర్దేశం చూపే ఒక స్నేహితురాలు మనకి తప్పక దర్శనమిస్తుంది. కొందరి జీవితాలకు ఆ నెచ్చెలి అందించిన ఆ దిశకు అక్షరరూపమే ఈ అనుభవాల నెచ్చెలి.
అలా పొందిన ఆ విజయాలు చిన్నవి కావచ్చు లేదా పెద్దవి అలాగే లోకమంతా గుర్తించేంత గొప్పవి కూడా కావచ్చు. అయితే ఈ పుస్తకంలో మాత్రం చిన్న చిన్న విజయాలకు, అలాగే చాలా మందికి సులభ సాధ్యాలుగానో లేదా కొంచెం కష్టపడైనా మనం వాటిని చేరుకోగలం అనిపించే విజయాలకే ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.
అలాంటి సామాన్య విజయాలతో పాటు మన సమాజంలోని కొన్ని చీకటి కోణాలను, "వీటికి పరిష్కారమే ఉండదా" అనేలాంటి కొన్ని జటిల సమస్యలనూ పాఠకుల ముందుంచి వాటికి సమాజం లేదా సమాజంలోని కొందరు
బాధితులు ఎలాంటి పరిష్కారాలను సూచిస్తున్నారన్నది ఈ పుస్తకం కొన్ని కథల సహాయంతో ఏకరువు పెడుతుంది. నిజానికి సమస్యల ఉచ్చులో చిక్కుకున్న వారు దానిలోంచి బయట పడి మమూలు జీవనం సాగించడం కూడా చెప్పుకోదగ్గ విజయమే.
అలాంటి సామాన్యుల అసామాన్య విజయాలూ, ఆ విజయాలను సాధించే క్రమంలో వారెదుర్కున్న అనుభవాలూ, సమాజంలోని చీకటి కోణాలలో కూరుకు పోకుండా వాటిని ఎత్తి చూపి, కొందరు సూచించిన సరికొత్త పరిష్కారాలూ, సమస్యల సుడిగుండంలో చిక్కుకుని కూడా ఆశావహ ధోరణిని వీడక ముందుకి అడుగులేసిన వారి అనుభవాలూ, ఇలా సమాజంలో మనం సాధారణంగా భావించే అసాధారణ అనుభవాలు, ఇవే ఈ పుస్తకంలోని కథాంశాలు.
ఇందులో ప్రస్తావించిన కథనాలన్నీ, వాస్తవ సంఘటనలకు కథన రూపాలే కానీ, కల్పితాలు ఎంత మాత్రం కావు. కాబట్టి, ఎవరైనా ఈ కథనాలతో ప్రేరేపితులై ఆ దిశగా అడుగెయ్యాలంటే హాయిగా వెయ్యొచ్చు.

Preview download free pdf of this Telugu book is available at Anubhavala Neccheli