• Anu Govinda
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • అను గోవింద...

    Anu Govinda

    Author:

    Publisher: Victory Publishers

    Pages: 55
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description
అను గోవింద...
(జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల భజగోవింద స్తోత్రము, వివరణ)

అద్వైత మత స్థాపకులైన శ్రీ జగద్గురు ఆది శంకరాచార్యుల వారిచే రచింపబడిన ఎన్నో స్తోత్రాలలో ఈ ''భజగోవిందం'', 'ద్వాదశ మంజరి' 'మోహముద్గరము' యను పేర్లతో పిలువబడుచున్నది. యిందలి మొదటి పన్నెండు శ్లోకాలు శంకరాచార్యుల వారు చెప్పుట వలన ద్వాదశ మంజరి యని, అరిష్వర్గము లోని ''మోహమును'' నిర్మూలించేటువంటి శ్లోకములు కావున ''మోహముద్గరమని'', భజగోవిందం అను పల్లవితో ప్రతీ శ్లోకము తర్వాత మకుటము వలె నిలుచుచుండుట వలన ''భజగోవింద శ్లోకాల''ని చెప్పబడుచున్నాయి.

ఒకసారి కాశీ నగరంలో శంకరాచార్యులవారు తన శిష్యులతో కలసి అరుణోదయ సమయంలో, గంగా స్నానముకు వెళ్ళుచుండగా త్రోవలో వ్యాకరణ పండితుడొకడు 'డుకృఞ్‌కరణె' 'డుకృఞ్‌కరణె' అంటూ వ్యాకరణ పాఠాన్ని వల్లె వేస్తూ విలువైన కాలాన్ని వృధా చేయుచున్నాడనిపించి, అతనికి మరియు అతని నెపముతో మనకు మోక్షమునకు సుగమమైన మార్గమును చూపింపదలచి 'భజగోవిందం.. ... డుకృఞకరణె ' అను పల్లవితో పన్నెండు మంజరులను చెప్పిరి. వీరి అనుజ్ఞతో శిష్యులు మరో పదునాలుగు మంజరులు చెప్పిరి. తిరిగి శంకరాచార్యులు, శిష్యుల యొక్క ప్రతిభకు ఆనంద పరవశుడై మరో నాలుగు మంజరులను ఆశీర్వచనములుగా అంద జేసిరి. వెరసి 31 మంజరులై 'భజ గోవింద' శ్లోకములుగా ప్రసిద్ధిగాంచినవని పండితుల ఉవాచ.

పరమ గోప్యమైన జీవిత మరియు పరమాత్మ తత్త్వమును సులభముగా అవగతము చేసికొనుటకు శంకరాచార్యుల వారు ఈ మంజరులను ముక్తి సౌధానికి సోపానములుగా అందించారు. అటువంటి ఈ జ్ఞానతత్త్వము, మోహముద్గరము అతి సామాన్యునికి సైతము అందుబాటులోకి వుండవలెనను తృష్ణతో, మాతృభాష అర్ధసిద్ధికి, భావసిద్ధికి, జ్ఞాన సిద్ధికి సులభతరమనెఱింగి, ఆ జగద్గురు శంకరుని ప్రసాదముగ భావించి, మా గురువులు మేడి చర్ల గోపాలకృష్ణమూర్తిశాస్త్రి గారి మరియు ఇప్పగుంట మాధవరావుగారి కృపాకటాక్షసిద్ధితో, తల్లిదండ్రుల దీవెనలతో, నాకు తెలిసినంత వరకు ''పదిమందికి ఉపయోగపును'' అను తృష్ణతో స్వేచ్ఛానువాదము చేయుట జరిగినది. అదియే సిద్ధించిన, నా జన్మ సుకృతముగా భావించెదను.

- వలివేటి

Preview download free pdf of this Telugu book is available at Anu Govinda