-
-
అంతు చిక్కని నీరు
Antu Chikkani Neeru
Author: I. V. Petranov
Pages: 96Language: Telugu
ప్రపంచంలో అతి ముఖ్యమైనది 'జీవం'. పదార్థపు అత్యున్నత స్థాయే జీవం. ఆ జీవానికి ఆధారం నీరు. మన దేహంలో నీరు 65 శాతాన్ని మించి ఉంది. నీరు లేకుండా కొన్ని రోజులు కూడా బతకలేం. మన శరీరంలోని ప్రక్రియలన్నీ జలయానకంలోనే జరుగుతాయి. కాబట్టి వాటన్నిటిలోనూ నీటి పాత్ర ఉంటుంది. కాని కచ్చితంగా ఆ పాత్ర ఏమిటో శాస్త్రవేత్తలు ఇప్పటికీ పూర్తిగా తెలుసుకోలేకపోతున్నారు.
అంతేకాదు, మరెన్నో విషయాల్లో అంతుచిక్కనిదీ, నిగూఢమైనదీ నీరు. నీటి రహస్యాలను ఎన్నింటినో విజ్ఞానశాస్త్రం ఇంకా ఛేదించాల్సి వుంది. ఒకటి మాత్రం వాస్తవం. ప్రకృతిలో నీటి కన్నా విలువైనదేదీ మనకు లేదన్నది సుస్పష్టం. నీటికి సంబంధించి మనకు తెలియని ఎన్నో విషయాలను ఈ పుస్తకం ఎంతో సరళంగా ఆసక్తికరంగా వివరిస్తుంది. నీరు ఎంత పుష్కలంగా లభ్యమవుతున్నప్పటకీ, రకరకాల కాలుష్యం వల్ల ప్రాణికోటికి తాగునీటి కొరత దాపురిస్తోంది. కాబట్టి నీటిని ఎందుకు, ఎలా కాపాడుకోవాలో కూడ ఇందులో రచయితలు విడమరచి చెప్పారు.
ప్రకృతిలో ఉన్న పదార్థాలన్నీ క్లిష్టమైన, ఆకస్మికమైన బంధాలతో కలపబడి విడదీయరాని ఏకమొత్తంగా ఉంటాయి. దీనికి ఒక ఉదాహరణ : చీమ- నది. నదిలో నిండుగా నీరుండాలంటే దాని ఒడ్డున ఒక అడవి పెరిగి తీరాలి. నది నీటిని కాపాడుకోవాలంటే ఒడ్డున ఉన్న అడవిని కాపాడుకోవాలి. అడవిని చీడ పురుగుల బారి నుంచి చీమలు ఎంతో జాగ్రత్తగా కాపాడుతాయి. (అయితే ఇవి అడవిని రంపాలు, గొడ్డళ్ల బారి నుండి రక్షించలేవనుకోండి). అలా ఒక పెద్ద నది జీవితం చిన్న చీమ జీవితంతో ముడిపడి ఉంటుంది. ఇలాంటి ఎన్నో విషయాలను ఈ పుస్తకం ఆసక్తికరంగా మన ముందుంచుతుంది.
